కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడటానికి కోర్టుల్లో చేసిన న్యాయ పోరాటాలు ఫలిస్తున్నాయి. రూ. వేల కోట్ల విలువైన భూములపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు కలిగింది. ఈ భూములను విక్రయించడం వల్ల ఆదాయం సమకూరుతుంది. దాన్ని ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటు పదిలంగానే ఉంది. ఏడాదిన్నరగా దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా, రెండంకెల వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టు కుంది. వరుసగా ఐదో ఏడాది జాతీయ సగటును అధిగ మించింది. మాంద్యం ప్రభావంతో 2018–19 ఆర్థిక ఏడాదిలో జాతీయ వృద్ధి రేటు 6.8 శాతానికి పతనం కాగా, తెలంగాణ వృద్ధి రేటు 10.5 శాతానికి ఎగ బాకింది.
రాష్ట్రంలో పశు సంపద, మైనింగ్, తయారీ, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, విద్య, వైద్యం తదితర రంగాలు ఏటేటా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడు తున్నాయి. 2017–18లో స్థిర ధరల వద్ద 5.6 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2018–19లో 10.5% వృద్ధి రేటుతో రూ. 6.19 లక్షల కోట్లకు పెరిగింది. 2017–18లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.7.54 లక్షల కోట్లు కాగా, 2018–19లో 14.8 శాతం వృద్ధిరేటుతో రూ.8.66 లక్షల కోట్లకు పెరిగినట్లు సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment