ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేతుల మీదుగా ‘వాలంటీర్’ టైటిల్ లాంచ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది.
త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్‌లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు.
నిర్మాత, వైఎస్సార్‌సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment