
ప. గో. జిల్లా: నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్‌కి లేఖ రాయించి వాలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు మాయల ఫకీరు, జిత్తులమారి నక్క అంటూ మండిపడ్డారు.
‘ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు. ఎండలు మండుతున్నాయి . పెన్షన్‌ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం. చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంటీర్లు అంటే ఇష్టం లేదు.
చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై పిర్యాదు చేయించాడు. వాలంటీర్లపై చంద్రబాబు నీచ బుద్ధి కపట ప్రేమ ఈరోజు బయటపడింది’ అని కారుమూరి విమర్శించారు.