సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసుపై 41ఏ ప్రోసీజర్ పాటించాలని కోర్డు ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాగా, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో విచారణలో భాగంగా 41ఏ ప్రొసీజర్‌ను పోలీసులు పాటించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ప్రోత్బలంతో కొందరు వలంటీర్లు వైఎస్సార్‌సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా అక్రమంగా కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment