సాక్షి, అమరావతి: కూటమి నేతలు మాటల మార్చారు. వాలంటీర్ల విషయంలో కూటమి నేతలు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ప్రభుత్వంలో మరోలా మాట్లాడుతూ.. వాలంటీర్ల(volunteers)ను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని బూకాయిస్తున్నారు. దీంతో, వాలంటీర్లకు నిరాశే ఎదురుకానుంది.
వాలంటరీ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మొండిచేయి ఇచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోమని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పరోక్షంగా స్పష్టం చేశారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారని తమ మంత్రి చెప్పారని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మాత్రం ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. అలాగే, వాలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు మాట మార్చడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాపంగా వాలంటీర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమను విధుల్లోకి తీసుకోవాలని నిరసనల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా తమకు రూ.10వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా విజయవాడలో వాలంటీర్లు వినూత్నంగా వెనక్కి నడుస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇది యూటర్న్ ప్రభుత్వం అనే ప్రయత్నం భాగంగా తాము ఇలా వెనక్కి నడిచినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment