సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనైనా సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయాలని, వలంటీర్లకు న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2న జరగనున్న కేబినెట్ భేటీలో వలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ 2,3,4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
జనవరి 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్‌లకు వినతి పత్రాలు, 3న జిల్లా కేంద్రాల్లో మోకాళ్లమీద కూర్చుని భిక్షాటన, 4న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ వలంటీర్లు బ్యాక్ టు వాక్ పేరుతో వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment