పల్నాడు జిల్లా: ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పునరాలోచించుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వా తాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు.
‘సీఎం జగన్‌పై కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు వాలంటర్లీపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయించాడు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. పెన్షన్లు తీసుకునే వారిపై కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, కుట్రలు, కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ బలవుతుంది వాలంటీర్లే కాదు.. అవ్వా తాతలు, దివ్యాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు’ అని అంబటి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment