సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని అబద్దాలు చెప్పడానికైనా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మరోసారి నిరూపితమైంది. అధికారం కోసం అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తీర్చలేక ప్రజలను మోసం చేస్తున్నాడు. మరోవైపు.. ఎన్నికలకు ముందు వాలంటీర్లపై కపట ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చాక.. వారిని నట్టేట ముంచేశాడు. దీంతో వారంతా దిక్కులేని స్థితిలో రోడ్డున పడ్డారని వాలంటీర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.
కాగా, వాలంటీర్లకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎక్స్ వేదికగా.. సీఎం చంద్రబాబు మొదటి నుంచీ వాలంటీర్లపై అక్కస్సు వెళ్లగక్కుతూనే ఉన్నారు. కానీ, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎలక్షన్స్ ముందు కపట హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టాడు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాలంటీర్లను నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వారి గ్రూపులన్నింటినీ డిలీజ్ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదివారం ఆదేశించారు. చంద్రబాబు తేనే పూసిన కత్తికి బలైపోయి లక్షలాది మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు అని పేర్కొంది.
ఇక, ఎన్నికల సమయంలో వాలంటీర్లపై చంద్రబాబు ఎంతో కపట ప్రేమను చూపించారు. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి.. వారికి జీతం రెట్టింపు చేస్తామన్నారు. వాలంటీర్ల జీతం రూ.10వేలు ఇస్తానని దొంగ హామీ ఇచ్చారు. కానీ, గెలిచాక మాత్రం చేతులెత్తేశారు.
వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు.
వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలు
చంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1— YSR Congress Party (@YSRCParty) August 5, 2024
Comments
Please login to add a commentAdd a comment