నేడు, రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
వేలాదిగా చేరుకున్న ఆస్తమా బాధితులు
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు బత్తిని హరినాథ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. కాగా.. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం తయారీ కోసం దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం మత్స్యశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్ తదితర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రూ.40 చొప్పున చేప పిల్లల టోకెన్ ధర నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే ఆస్తమా రోగులు, వారి సహాయకులకు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందుకోసం 300 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వలంటీర్లు విడతల వారీగా విధుల్లో ఉంటారు. చేప ప్రసాదం కార్యక్రమ ప్రారం¿ోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహా్వనించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఆస్తమా బాధితులు తరలివచ్చారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గృహకల్ప, గగన్ విహార్‌ల వద్ద తమ వాహనాలను పార్క్ చేసి గేట్‌నెం. 2 ద్వారా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి చేరుకోవాలని
సూచించారు. వీఐపీలకు గేట్‌నెం.1 నుంచి ప్రవేశం కలి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment