సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్ గౌడ్(84) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు.
వివరాల ప్రకారం.. చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ అనారోగ్యం కారణంగా మృతిచెందారు. హరినాథ్ గౌడ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇక, ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది చేప ప్రసాదం. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ నలు మూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆస్తమా బాధులు రెండు రోజుల ముందుగానే నగరానికి వస్తుంటారు.
చేప మందు చరిత్ర ఇదే..
1847లో హైదరాబాద్ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. నాడు వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా గత 176 ఏండ్లుగా చేప మందు పంపిణీ కొనసాగుతూనే ఉన్నది. అయితే మధ్యలో కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. చేపమందుకు కోసం వచ్చేవారికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నది.
ఇది కూడా చదవండి: Hyderabad: హోటల్ మేనేజర్‌పై కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment