Chepa mandhu Prasadam
-
చేప ప్రసాదానికి వేళాయే
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు బత్తిని హరినాథ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. కాగా.. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం తయారీ కోసం దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం మత్స్యశాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్ తదితర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రూ.40 చొప్పున చేప పిల్లల టోకెన్ ధర నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే ఆస్తమా రోగులు, వారి సహాయకులకు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందుకోసం 300 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వలంటీర్లు విడతల వారీగా విధుల్లో ఉంటారు. చేప ప్రసాదం కార్యక్రమ ప్రారం¿ోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహా్వనించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఆస్తమా బాధితులు తరలివచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలు.. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గృహకల్ప, గగన్ విహార్ల వద్ద తమ వాహనాలను పార్క్ చేసి గేట్‌నెం. 2 ద్వారా ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి చేరుకోవాలని సూచించారు. వీఐపీలకు గేట్‌నెం.1 నుంచి ప్రవేశం కలి్పంచారు. -
విషాదం: బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్ గౌడ్(84) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. వివరాల ప్రకారం.. చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ అనారోగ్యం కారణంగా మృతిచెందారు. హరినాథ్ గౌడ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇక, ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది చేప ప్రసాదం. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ నలు మూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆస్తమా బాధులు రెండు రోజుల ముందుగానే నగరానికి వస్తుంటారు. చేప మందు చరిత్ర ఇదే.. 1847లో హైదరాబాద్ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. నాడు వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా గత 176 ఏండ్లుగా చేప మందు పంపిణీ కొనసాగుతూనే ఉన్నది. అయితే మధ్యలో కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. చేపమందుకు కోసం వచ్చేవారికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నది. ఇది కూడా చదవండి: Hyderabad: హోటల్ మేనేజర్‌పై కాల్పులు -
మూడు సంవత్సరాల తర్వాత మల్లి ప్రారంభం అయ్యేనా చేప ప్రసాదం
-
చేప ప్రసాదం పంపిణీకి భారీ సన్నాహాలు (ఫొటోలు)
-
ఇబ్బందులు కలగకుండా చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : చేప మందు ప్రసాదం కోసం వచ్చే వారికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 173 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా బత్తిని హరనాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేపమందు ప్రసాదం కోసం మన రాష్ట్రం నుంచే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకునేలా సీఎస్‌తో చర్చింమన్నారు. చేపమందు ప్రసాదం కోసం వచ్చేవారికి జీహెచ్ఎంసీ అధ్వర్యంలో రూ.5కే భోజన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ అధ్వర్యంలో రవాణా ఏర్పాట్లు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే వారందరికి సరిపడా చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు భేష్ : బత్తిని ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేప మందు ప్రసాదం కార్యక్రమం కోసం అనేక ఏర్పాట్లు చేస్తోందన్నారు బత్తిని హరనాథ్ గౌడ్. 8వ తేదీ సాయంత్రం మొదలై 9వ తేదీ రాత్రి వరకూ చేప ప్రసాదం అందజేస్తామన్నారు. ఒక వేళ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దొరక్కపోతే.. తమ నివాస గృహాల్లో.. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రసాదం అందజేస్తారని తెలిపారు. చేప ప్రసాదం కోసం గత ఏడాది లానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలందరికి సరిపోయే విధంగా చేప ప్రసాదం తయారు చేస్తామన్నారు. -
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
- ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు - వెల్లడించిన బత్తిని సోదరులు హైదరాబాద్: ఉచిత చేప ప్రసాదాన్ని జూన్ 8న ఉదయం 6 గంటలకు పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు విశ్వనాథం గౌడ్, హరినాథ్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్లు తెలిపారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఉబ్బస వ్యాధి గ్రస్తులకు పాతబస్తీలోని దూద్‌బౌలిలో బత్తిని వంశం ఆధ్వర్యంలో ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం బత్తిని సోదరులు సాక్షితో మాట్లాడుతూ... జూన్ 8న దూద్‌బౌలి లోని తమ నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేస్తామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లక్షలాది మంది చేప మందు సేవించేందుకు విచ్చేస్తారని, వారి కోసం ప్రభుత్వం తరఫు న అన్ని ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయని బత్తిని సోదరులు తెలిపారు. దూద్‌బౌలిలోని తమ ఇంట్లో 8, 9న చేపమందు పంపిణీ చేస్తామన్నారు. ఈ చేప ప్రసాదాన్ని ఉచి తంగా పంపిణీ చేస్తున్నామని, నకిలీ చేప ప్రసాదం పంపి ణీ చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష ఉచిత చేప మందు పంపిణీ కోసం లక్ష చేప పిల్లలను సిద్ధం చేయాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జూన్ 8న నిర్వహించనున్న చేప మందు పంపిణీ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలోని మంత్రి చాంబర్లో పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ, బత్తిని సోదరులు అందించే చేప మందు కోసం నగరంలోని ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. దూర ప్రాంతాల వారి కోసం 110 ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు చెప్పా రు. హెల్త్ క్యాంప్‌లను నిర్వహించడంతో పాటు నాలుగు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ మైదానానికి చేపల సరఫరా కోసం మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలని, బారికేడ్లను అమర్చాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, సెంట్రల్ జోన్ డీసీపీ డేవిడ్ జోయల్ తదితరులు పాల్గొన్నారు.