
హైదరాబాద్: ఇన్సూరెన్స్ దేఖో సంస్థ ఐఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కుల్‌దీప్ త్రివేది, ఆయన బృందాన్ని నియమించుకుంది. బీమా పంపిణీలో కుల్‌దీప్ త్రివేదికి 25 ఏళ్ల అనుభవం ఉంది. బీమా పంపిణీ వెంచర్లలో ఆయనకు ఎంతో ట్రాక్ రికార్డ్ కూడా ఉంది.
త్రివేది, ఆయన బృందం ఇన్సూరెన్స్ దేఖో పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతోపాటు కీలకమైన పశ్చిమ భారత్ మార్కెట్లో సేవల విస్తరణపై దృష్టి పెడుతుందని కంపెనీ ప్రకటించింది. ఇన్సూర్‌టెక్ సంస్థ అయిన ఇన్సూరెన్స్ దేఖో ఇటీవలే 150 మిలియన్ డాలర్లను సమీకరించడం గమనార్హం. ఈ సంస్థ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారించింది.