west india
-
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
ఇన్సూరెన్స్ దేఖోలో చేరిన కుల్దీప్ త్రివేది
హైదరాబాద్: ఇన్సూరెన్స్ దేఖో సంస్థ ఐఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కుల్దీప్ త్రివేది, ఆయన బృందాన్ని నియమించుకుంది. బీమా పంపిణీలో కుల్దీప్ త్రివేదికి 25 ఏళ్ల అనుభవం ఉంది. బీమా పంపిణీ వెంచర్లలో ఆయనకు ఎంతో ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. త్రివేది, ఆయన బృందం ఇన్సూరెన్స్ దేఖో పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతోపాటు కీలకమైన పశ్చిమ భారత్ మార్కెట్లో సేవల విస్తరణపై దృష్టి పెడుతుందని కంపెనీ ప్రకటించింది. ఇన్సూర్టెక్ సంస్థ అయిన ఇన్సూరెన్స్ దేఖో ఇటీవలే 150 మిలియన్ డాలర్లను సమీకరించడం గమనార్హం. ఈ సంస్థ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. -
సిరీస్ గెలిచినా.. పాయింట్లు కోల్పోయారు!
దుబాయ్: వెస్టిండీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సిరీస్ భారత్ సొంతమైంది. అయితే విరాట్ సేన సిరీస్ ను గెలిచినప్పటికీ పాయింట్లను మాత్రం కోల్పోయింది. ఈ సిరీస్ తరువాత విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ మూడో స్థానం నిలబెట్టుకుంది. కాగా, రెండు పాయింట్లను నష్టపోయింది. విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు 116 రేటింగ్ పాయింట్లతో బరిలోకి దిగిన భారత్ జట్టు.. సిరీస్ ముగిసిన తరువాత 114 పాయింట్లకు పడిపోయింది. విండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ జట్టు ఓటమి పాలుకావడం పాయింట్ల కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. అయితే తన స్థానాన్ని మాత్రం టీమిండియా తిరిగి నిలబెట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 119 రేటింగ్ పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్ 113 పాయింట్లతో నాల్గో స్థానానికి పరిమితమైంది.