సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజునే 56,66,888 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,322.59 కోట్ల పింఛన్ల నగదు పంపిణీ చేసింది. తెల్లవారుజామునుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 60,81,073 మందికి ప్రభుత్వం ఈ నెల పింఛను విడుదల చేయగా.. తొలిరోజున 93.19 శాతం మందికి పంపిణీ పూర్తయింది. తొలిరోజు అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 95.23 శాతం మందికి పంపిణీ పూర్తవగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 90.80% మందికి పంపిణీ పూర్తయింది. మిగిలిన వారికి వరుసగా మరో 4 రోజుల పాటు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛను సొమ్ము అందజేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఇంతియాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment