వివాదం.. అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు | Dispute Between TRS Leaders In Asifabad District | Sakshi
Sakshi News home page

వివాదం.. అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు

Published Wed, Dec 30 2020 7:36 PM | Last Updated on Wed, Dec 30 2020 8:09 PM

Dispute Between TRS Leaders In Asifabad District - Sakshi

ఎమ్మెల్యే, జడ్పీ  చైర్మన్ మధ్య పోరు అగ్గిరాజేస్తోంది.. ఆధిపత్యం  కోసం  రెండు వర్గాలు  కత్తులు దూసుకుంటున్నాయి. వర్గాలు వీడిపోయి  ఒకరి పై ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే టార్గెట్ చేయడానికి కారణాలేంటి,? ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీలో కుంపట్లపై సాక్షి టీవీ స్పేషల్ రిపోర్ట్.

సాక్షి, ఆదిలాబాద్‌ : కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గూలాబీ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే అత్రం సక్కు, జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే అత్రంసక్కు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోవ లక్ష్మిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత సక్కు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరారు. కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో జైనూర్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి గిరిజనులకు కేటాయించడంతో కోవలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇద్దరు ఒకే నియోజకవర్గం కావడంతో పార్టీలో పట్టుకోసం వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ఆధిపత్యం కోసం వర్గాలను పెంచిపోషిస్తున్నారు. అభివృద్ధి పనులైనా, పదవులైనా అనుచరులకు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. ఒక వర్గానికి అధికారులు పనులు ఇస్తే. తనవర్గానికి పనులు ఇవ్వడం లేదని ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో అధికారులకు అడకత్తేరలో ‌పోక‌మాదిరిగా మారింది.

ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా
ఒక వర్గానికి  పనులు ఇస్తే.. మరోక వర్గం అధికారులపై కస్సుబుస్సు మంటోది. అదే విధంగా ఎస్సైలు, సీఐలు, మండల పరిషత్ అధికారులు, ఎమ్మార్వోలు ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటే, జడ్పీ చైర్మన్‌కు గిట్టడంలేదట. చైర్మన్‌కు అనుకూలంగా ఉంటే ఎమ్మెల్యే సక్కుకు గిట్టడం లేదట. ఇద్దరి ప్రజాప్రతినిధుల పెత్తనం వల్ల అధికారులు నలిగిపోతున్నారట. కొందరు అధికారులు ఈ పెత్తనం వేధింపులు తట్టుకోలేక బదిలీ దారులు వెతుకున్నారట. అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గోయ్యి‌లా ఉంటే.. కార్యకర్తలది నాయకులది విచిత్రమైన పరిస్థితి. ప్రతి మండలంలో ఎమ్మెల్యే సక్కు వర్గం,  జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి వర్గాలుగా విడిపోయారు. చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యేపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం ఉంది. సిర్పూర్ మండలం జడ్పీటీసీగా కోవలక్ష్మి కూతురు విజయం సాధించింది‌. కోవలక్ష్మి జడ్పీటీసీగా గెలుపొందిన జైనూర్, సిర్పూర్ మండలాల్లో చైర్మన్ అంత జనన కనుసన్నలో నడిపిస్తోందట. జిల్లా పరిషత్ నుంచి కేటాయించే నిధులు తనకు అనుకూలంగా కేటాయిస్తోందట. ఎమ్మెల్యే సక్కు తానేం తక్కువ కాదని ఎమ్మెల్యే కోటా నిధులు తనవర్గానికి కేటాయించి పట్టుపెంచుకున్నారట. చైర్మన్ వర్గాన్ని దూరం పెడుతున్నారని జోరుగా నియోజకవర్గంలో ప్రచారం సాగుతుందట. పైకి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఉన్నారని కార్యకర్తల్లో చర్చసాగుతుందట.

గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ మొదలైంది. ఓటమి పాలైన వారికి టిఅర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదని.. తనకే టిక్కెట్ దక్కుతుందని సక్కు ప్రచారం చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే టికెట్ దక్కని.. జడ్పీ చైర్మన్ వర్గంలో ఉండటం కన్నా రాజకీయ భవిష్యత్తు కోసం వర్గంలోకి రావాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారట. ఆ ప్రచారాన్ని నమ్మి కొందరు కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు చైర్మన్ వర్గం నుంచి ఎమ్మెల్యే వర్గంలోకి చేరిపోయారట. జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. ఇప్పటికే జైనూర్, సిర్పూర్ మండలాల్లో తన ఆధిపత్యంలో ఉందని.. మిగితా తిర్యాణి, వాంకిడి, నార్నూర్, గాదే గూడ మండలాల ప్రజా ప్రతినిధులు తనవైపు ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారట. అదే విధంగా పార్టీ పెద్దల అండ తనకు టిక్కెట్ దక్కుతుందని సన్నిహితులకు చెప్పకుంటున్నారట. ఒకే పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీ మాదిరిగా వ్యతిరేక ప్రచారం చేసుకోవడంపై కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఇప్పుడే ఇలా గొడవలు ఉంటే.. మరి ఎన్నికల నాటికి టికెట్ గొడవలు ఎటువైపు ఎక్కడి వరకు పోతాయోనని కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఈ ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదుర్చాలని కార్యకర్తలు కోరుతున్నారట. పార్టీ పెద్దలు  ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement