
ప్రతీకాత్మక చిత్రం
మంచిర్యాల టౌన్ : ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి ఆసిఫాబాద్‌కు వెళుతుండగా, బస్సులోకి పాము దూరడంతో కలకలం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి లగ్జరీ బస్సు పెద్దపల్లి వరకు రాగానే, పాము బస్సులోకి వచ్చి చేరింది. అయితే డ్రైవర్ పాము కోసం వెతికినప్పుడు అది కనిపించకపోవడంతో వెళ్లిపోయిందనుకుని బయలుదేరారు. శ్రీరాంపూర్‌కు చేరుకునే సరికి పాము డ్రైవర్ సీటు కిందనే ఉండడంతో బస్సును పక్కన నిలిపి వేశాడు. వెంటనే ప్రయాణీకులను కిందకు దించి, స్థానికుల సహాయంతో పామును బయటకు పంపి దానిని చంపేశారు.