
సాక్షి, అసిఫాబాద్: జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం అసిఫాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏఆర్ హెడ్‌క్వార్టర్ట్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐజీ నాగిరెడ్డి, అదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, ఏఎస్పీ సుధీంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తప్పించుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ , మెడం భాస్కర్ , వర్గీస్ తెలంగాణలో ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ తేల్చిన క్రమంలో మూడు రోజులుగా గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చత్తీస్‌గఢ్ వైపు నుంచి తెలంగాణలోని కొమురం భీమ్ అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి వస్తున్న మావోయిస్టుల కదలికలపై సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించారు. మరోవైపు రెండు జిల్లాల అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.(తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్)
Comments
Please login to add a commentAdd a comment