
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అడవుల్లోని కొండల మధ్య జాలువారుతున్న దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అడవుల్లో అందాలు దాగి ఉన్న అందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జలపాతాల వద్ద సరైన వసతులు లేకున్నప్పటికీ పర్యాటకుల సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. పలు జలపాతాల వద్దకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పిస్తే మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు లేకపోలేదు.
సాక్షి, ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర, గుండాల జలపాతం సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. చింతలమాదర జలపాతానికి చేరుకోవాలంటే మండల కేంద్రం నుంచి 15కిలో మీటర్ల వయా సుంగాపూర్ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల ముందు నుంచి నడకనే ద్వారానే వెళ్లడం సాధ్యమవుతుంది. మండలంలోని మరో జలపాతం గుండాల.
ఈ జలపాతం చేరుకోవాలంటే 16కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందులో 10కిలో మీటర్లు వయా రోంపెల్లి మీద నుంచి వాహనాల ద్వారా వెళ్లవచ్చు. మిగత ఆరు కిలో మీటర్లు దట్టమైన అడవి కొండలపై నడుచుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం పర్యాటకులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని గురిస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఆకర్షిస్తున్న కుంటాల
రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమిది. తెలంగాణ నయాగార పిలుచుకునే ఈ వాటర్‌ఫాల్స్ టీవీ సీరియల్స్ ద్వారా మనకు సుపరిచితమే. ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల వద్ద ఉంది. ఈ జలపాతం చుట్టూ దట్టమైన కుంటాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అయితే ఇప్పటివరకు జలపాతం జలధారతో ఉట్టిపడింది. ఇప్పుడు వర్షాలు లేక జలధార బోసిపోయి కనిపిస్తుంది. అయినప్పటికీ పర్యాటకుల తాకిడి తగ్గడంలేదు. జలపాతం అందాలను ఆస్వాదించి వెనుదిరుగుతున్నారు.
సముతుల గుండం
వర్షాకాలంలో ప్రకృతితో పరశించిపోతున్న సుముతుల గుండం జలపాతం కుమురం భీం జిల్లా నుంచి 26కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కలదు. జిల్లా నుంచి వాహనాలు బలంపూర్ 21కిలో మీటర్ల వరకు రోడ్డు సౌకర్యాల కలదు. మిగతా 5కిలో మీటర్ల వరకు దట్టమైన అడవి పెద్ద పెద్ద రాళ్లు మధ్యలో కాలినకతో వెళ్లాల్సి వస్తోంది.
ఆసిఫాబాద్ మండలంలోని ఏకైక జలపాతానికి సంబంధిత అధికారులు రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రకృతి ప్రేమికులతో పాటు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోందని స్థానికులు అంటున్నారు. వర్షాకాలంలో జలపాతం చుట్టు పచ్చని అటవితో పర్చుకుని నీరు జాలువారుతో అందరిని ఆకర్షిచే విధంగా ఈ జలపాతం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment