కెరమెరి(ఆసిపాబాద్) : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ఆదివాసీ గ్రామమైన జాబేఝరి అడవులు ఊహల్లోకి విహరింపజేస్తున్నాయి. ఎవరూ ఊహించని, చూడని బాబేఝరి అడవులు మరో కశ్మీర్‌ను తలపిస్తున్నాయి. బాబేఝరి, టోకెన్‌మోవాడ్, పిట్టగూడ గ్రామాలకు ఆనుకొని వందల ఎకరాల విస్థీర్ణంలో ఉన్న ఈ అడవులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగుబురుగా పొదలు, ఆ పొదల్ల మధ్య పచ్చపచ్చని పొలాలు, అందమైన లోయలు ఎంతో అహ్లద భరితంగా కనిపిస్తున్నాయి. ఓ సారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించక మానదు. అయితే వర్షాకాలంలో ప్రతి రోజు చల్లటి వాతావరణం ఉండేది ఇక్కడ.
ప్రస్తుతానికి వర్షాకాలం ముగిసినా తేలిక పాటి చిరుజల్లులు పడుతూనే ఉంటాయి. దీంతో ప్రకతి పచ్చదనాన్ని పరచినట్లు ఆ దృశ్యాలను చూస్తే మైమరచి పోతాం. అలాగే హట్టి పై భాగం నుంచి ములుపులు తిరిగిన రోడ్డు, పచ్చపచ్చని పొలాలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment