కెరమెరి (ఆసిఫాబాద్): ఎదిగిన బిడ్డకు పెళ్లి చేయాలనుకుంది. పది రోజుల క్రితమే పెళ్లి సంబంధం రావడంతో సంబరపడింది. అయితే పెళ్లికి డబ్బు లేక తల్లడిల్లింది. పత్తి పంట చేతికి వస్తుందని అనుకున్న తరుణంలో మాడిపోవడం చూసి కుంగిపోయింది. కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలి యక దిగులు చెంది మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం పెద్ద కరంజివాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాథోడ్ మీరా బాయి, వసంత్‌రావు దంపతులకు కుమారుడు కిరణ్, కూతురు సుజీ ఉన్నారు. వసంత్‌రావు పదేళ్ల క్రితం చని పోయాడు. అప్పటి నుంచి మీరాబాయి వ్యవసాయం చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూస్తోంది. ఈ సీజన్‌లో రూ.80 వేలు అప్పు చేసి తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేసింది. అయితే ప్రకృతి కరుణించక పత్తి పంట మాడిపోయింది.
కనీసం 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించినా.. ఐదు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. పది రో జుల కిందట కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేక పోవ డం, పంట దిగుబడి సరిగా రాక పో వడంతో మీరాబాయి (40) గురు వా రం పత్తి చేనులోనే పురుగు మందు తాగింది. కుటుంబ స భ్యులు ఆమెను కెరమెరి పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
మీరాబాయి
మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment