
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలోని వెనుకబడిన జిల్లా ఆసిఫాబాద్ జిల్లా అద్భుతమైన పురోగతి సాధిస్తోందని నీతి ఆయోగ్ తాజా నివేదిక చాటుతోంది. దేశంలో వెనుకబాటు నుంచి పురోగమి పథంలో సాగుతున్న జిల్లాల జాబితాను తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ జాబితాలో గతంలో వందో స్థానంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లా అద్భుతమైన పురోగతితో 15వ స్థానానికి ఎగబాకింది. విద్య, వైద్యం, వ్యవసాయం, సమ్మిళిత ఆర్థిక వృద్ది, మౌలిక సదుపాయాల ఆధారంగా జిల్లాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా వెనుకబడిన 115 జిల్లాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం (ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ స్కీమ్) అని దీనికి నామకరణం చేసింది. తెలంగాణ నుంచి భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం తదితర వెనుకబడిన జిల్లాలు ఈ పథకంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, కడప తదితర జిల్లాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment