ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాట్లు వేగవంతం
Published Fri, Oct 7 2016 11:57 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
విభ జన పనుల్లో అధికారులు బిజీబిజీ
కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల వేట
ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాట్లలో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ఆసిఫాబాద్‌ను కొమరంభీమ్ జిల్లాగా ప్రకటించి ఈ నెల 11 దసరా నుంచి జిల్లా పరిపాలన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో శరవేగంగా పనులు సాగుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల భవనాలను జిల్లా కార్యాలయాల కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. సబ్ కలెక్టర్ అద్వైత్‌సింగ్ ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు సుమారు 55 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పా టు చేయాల్సి ఉండగా.. 50 శాతం భవనాలను గుర్తించా రు. గతంలో జిల్లా కేంద్రంగా వెలుగొందిన ఆసిఫాబాద్‌లో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు చాలా భవనాలు అనుకూలంగా ఉండడంతో అధికారులకు శ్రమ తప్పింది. జిల్లా ప్రకటిం చిన 24 గంటలలోపే సబ్ కలెక్టర్ ప్రభుత్వ భవనాలను గుర్తించారు. కాగజ్‌నగర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా, సిర్పూర్(యు) మండలంలో కొత్తగా ఏర్పాట య్యే లింగాపూర్ మండలం, కాగజ్‌నగర్ నియోజకవర్గం లోని పెంచి కలపేట, చింతలమానెపల్లి మండలాల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు.
కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయాలతోపాటు, ఫైళ్ల విభజనలో అధికారులు బిజీ ఉన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను కలెక్టర్ జగన్మోహన్, సబ్ కలెక్టర్ పరిశీలించారు. పట్టణంలోని వైటీసీ భవనంలో కలెక్టరేట్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, డీఎస్‌వో, అసిస్టెంట్ డెరైక్టర్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, ఏఎంసీ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయం, పోస్ట్‌మెట్రిక్ హాస్ట ల్ భవనంలో ఎక్సైజ్, హర్టికల్చర్, వ్యవసాయ, ఆత్మ, సిరికల్చర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సెరికల్చర్, జిల్లా ట్రెజరీ, ఎంప్లాయిమెంట్, వెటర్నరీ ఆస్పత్రి కొత్త భవనంలో పశుసంవర్ధశాఖ, మత్స్యశాఖ కార్యాలయా లు, జెడ్పీ బాలుర పాఠశాలలో డీఈవో, సాక్షర భారత్, గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో గ్రౌండ్‌వాటర్ కార్యాలయం, ఎస్సీ దుకాణాల సముదాయంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాలు, మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణరుుంచారు. ఫైర్‌స్టేషన్‌లో ఆ శాఖ జిల్లా కార్యాలయం కొనసాగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ సబ్ జైల్లోనే జిల్లా జైలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత సబ్ కలెక్టర్ నివాసంలో కలెక్టర్ నివాసం, జైలు క్వార్టర్లలో ఎస్పీ నివాసం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మిగితా కార్యాలయాల భవనాల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement