
వీఆర్‌ఏ తిరుపతిని అడ్డుకుంటున్న నాయకులు
పెంచికల్‌పేట్: కొమురంభీం జిల్లా పెంచికల్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కోయచిచ్చాల వీఆర్‌ఏ తిరుపతి శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని వీఆర్‌ఏలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తిరుపతి ఒంటిపై పెట్రోల్ పోసుకోగా అక్కడే ఉన్న నాయకులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, రిలే దీక్షలకు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి మద్దతు ప్రకటించారు.