మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు
సాక్షి, ఆసిఫాబాద్: ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ మార్పు ఎపిసోడ్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులకు ఈ మార్పు మింగుడు పడడం లేదు. రెండురోజులు గా జిల్లాలో జరగుతున్న పరిణామాలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల అభిమానులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్నా యి. ఈ నెల 2న కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్, పినపాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం కావడం తెలిసిందే. ఆ మర్నాడు పార్టీ మారడంపై కాంగ్రెస్ నేతలు ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు చేయడం సక్కు కూడా ఆ పార్టీ నేతలకు సోమవారం ఘాటుగా సమాధానం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం లో టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం మాత్రం ఒకింత ఆం దోళన వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా ఉన్న వారితో కలిసి పని చేయడం ఎ లా అని తర్జనభర్జన పడుతున్నారు. మొన్న జరి గిన ఎన్నికల్లో ఒకరినొకరు విమర్శించుకోవడంతో పాటు, పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భా విస్తుండడంతో ఎవరూ కూడా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా బహిరంగంగా నోరు మెదపడం లేదు.
నాయకుల్లో కలవరం
మొన్నటివరకు రాజకీయంగా ఆత్రం సక్కు, కోవ లక్ష్మీ వర్గాలు రాజకీయంగా శత్రువులుగా ఉన్నా యి. సక్కు పార్టీలో చేరికను ఆహ్వానిస్తున్నట్లు చె బుతున్నప్పటికీ భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని పలువురు ఆం దోళన చెందుతున్నారు. తమ నాయకత్వానికి ఎ క్కడ ముప్పు వస్తుందోనని భయపడుతున్నారు. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మీ డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ పార్టీలో గుర్తింపును కాపాడుకుంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకురాలు కావడంతో స్థానిక అధికారులతో సాధారణ ప్రజానీకంలోనూ ఆమె స్థానం చెదిరిపోకుండా ఉంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఆమెకు ఎమ్మెల్యేగా ఎటువంటి అధికారికంగా ప్రొటోకాల్ లేకున్నప్పటికీ అనధికారంగా ఆహ్వానాలు అందుతున్నాయి. ఆమె వర్గానికి కూ డా అంతే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పదవి లేకున్నప్పటికీ అధికార యంత్రాంగంతో పనులు చేయించుకోవడంతోపాటు స్థానికంగా పలుకుబడి కాపాడుకుంటున్నారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సక్కు పార్టీ మారడంతో ప్రస్తుత టీఆర్‌ఎస్ కేడర్‌లో ఆందోళన మొదలైంది. ఇక నుంచి అధికారంలో ఉన్న పార్టీతోపాటు పదవిలో ఉన్న ఎమ్మెల్యేకే అంతా ప్రాధాన్యం ఇవ్వడం సహజం గా జరుగుతుంది. తమవర్గం భవిష్యత్ ఎలా ఉం డబోతుందనే ఆలోచనలో పడ్డారు. అలాకాకుండా ఇరువర్గాలు ఒకరిని ఒకరు కలుపుకుపోతే ఏ గొడవ రాకపోవచ్చు. కానీ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా జరిగే ఈ గ్రూపు విభేదాలతో ఎవరికి అంతిమంగా లబ్ధి చేకూరనుందోనని కొంత మంది నాయకులు ఆందోళనలో పడుతున్నారు. భవిష్యత్‌లో పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
సిర్పూర్ పరిస్థితి ఎదురైతే?
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై రాజకీయ వర్గాలు జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నాయి. అక్కడ ఇదే తరహాలో 2014లో కావేటి సమ్మయ్య టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి కోనేరు కోనప్ప చేతిలో స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీఎస్పీ నుంచి పోటీచేసి గెలుపొందిన కోనప్ప టీఆర్‌ఎస్‌లో చేరికతో కావేటి రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడింది. కాలక్రమేణా పార్టీలోనూ పూర్తిగా పట్టుకోల్పోయారు. చివరకు శాసనసభ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌లో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తుండడంతో కార్యకర్తలు కలరపాటుకు గురవుతున్నారు. కొత్తగా చేరేవారి ఆధిపత్యం పార్టీలో మొదలైతే తమ పరిస్థితి ఏమిటనేది తలచుకుంటే భయంగా ఉందని పార్టీలో సీనియర్‌గా ఉన్న ఓ నాయకుడు చెప్పుకొచ్చాడు.
అయితే కొందరు మాత్రం పార్టీలో ఎంత మంది చేరినప్పటికీ ఎవరి గుర్తింపు వారికి ఉంటుందని చెబుతున్నారు. ఇరువర్గాలు సమన్వయంతో ముందుకు వెళ్తామంటున్నారు. పార్టీ అధిష్టానం ఇరువురికి తగిన న్యాయం చేస్తుందని సిర్పూర్ తీరు ఇక్కడ ఉండబోదని ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాత్రం పార్టీలో ఎవరూ చేరిన తమకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అందరితో కలిసి పని చేస్తామని చెబుతున్నారు. అయితే వచ్చే పార్లమెంటు, పరిషత్ ఎన్నికల్లో ఇరువర్గాల నుంచి కింది స్థాయిలో కేడర్ ఏ మేరకు కలిసి పని చేస్తాయో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment