ఆసిఫాబాద్(ఆదిలాబాద్ జిల్లా): కాన్సర్‌తో బాధపడుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో జరిగింది. తిర్యాణి మండల కేంద్రానికి చెందిన తిప్పరి స్రవంతి(23) ఆసిఫాబాద్‌లోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కాలేజీలో చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య
Published Mon, Mar 23 2015 9:35 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement