
సాక్షి, ఆసిఫాబాద్: గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పోర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ వరదల వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చి వరదలో చిక్కుకున్నారు కార్మికులు. ఆ వివారలు..
ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం సృష్టించింది. పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన వీరు శుక్రవారం ప్రమాదవశాత్తు వాగులో చిక్కుకుపోయారు. తమను కాపాడాలని క్యాంప్‌పై నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment