
సాక్షి, ఆసిఫాబాద్ : తమ ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనుషులే కాదు. మూగ జంతువులు సైతం బాధతో విలపిస్తాయి. బుధవారం కుమురం భీం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఓ ఆవు అనారోగ్య కారణంతో మృతి చెందింది. మరణించిన ఆవును గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ వెనక వైపు తాడుతో కట్టి పట్టణ శివారువైపు తీసుకెళ్తుండగా తోటి పశువులు చూసి తమ ఆత్మీయురాలిని కోల్పోతున్నామనే బాధతో ఆ ట్రాక్టర్‌ను అరుస్తు వెంబడించసాగాయి. సబ్ జైలు సమీపం నుంచి ఆదిలాబాద్ చౌరస్తా వరకు ఆ ట్రాక్టర్ వెనకలే దాదాపు రెండు కిలోమీటర్ల మేర పరిగెడుతూ తమ మూగ బాధను వెల్లబుచ్చాయి.
మృతి చెందిన ఆవును బాధతో వెంబడిస్తున్న తోటి ఆవులు
Comments
Please login to add a commentAdd a comment