సాక్షి, ఆసిఫాబాద్ : జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసు విచారణ ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఏడుగురు సాక్షులు సోమవారం ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు హాజరు అయ్యారు. సెలవు దినాలు తప్ప ఈ నెల 31 వరకూ రోజుకు ఏడుగురు సాక్ష్యులను న్యాయస్థానం విచారణ చేయనుంది. సాక్ష్యుల స్టేట్‌మెంట్ రికార్డు అనంతరం, పోలీసులు సేకరించిన ఆధారాలు, ఎఫ్‌ఎస్‌ఎల్, డీఎన్‌ఏ నివేదికలు పరిశీలించిన తర్వాత జనవరి మొదటివారంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా గత నెల 24న దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment