Fasttrack court
-
బాలికపై లైంగిక దాడి కేసులో ఇరవై ఏళ్ల జైలు శిక్ష
చిత్తూరు అర్బన్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఇలాంటి ఘటనల్లో కేసులను సత్వరమే విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానంతో బాధితులకు సత్వర న్యాయం లభించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన బి.గంగాధర్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరులోని ‘పోక్సో’ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి కేసు వివరాలు వెల్లడించారు. 2018 జనవరి 13న మదనపల్లెలో.. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్పటి మదనపల్లె టూటౌన్ సీఐ నరసింహులు కేసు దర్యాప్తు చేసి మదనపల్లె పట్టణం గొల్లపల్లెకు చెందిన గంగాధర్‌ను అరెస్టు చేసి అదే నెల 17న కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణలో పోలీసులు సరైన సాక్ష్యాలు చూపడంతో గంగాధర్‌కు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ఇన్చార్జ్ న్యాయమూర్తి యు.ప్రసాద్ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లిస్తే ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి ఇవ్వాలని, చెల్లించకుంటే అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. -
సమత కేసు: కోర్టుకు ఏడుగురు సాక్ష్యులు
సాక్షి, ఆసిఫాబాద్ : జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసు విచారణ ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఏడుగురు సాక్షులు సోమవారం ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు హాజరు అయ్యారు. సెలవు దినాలు తప్ప ఈ నెల 31 వరకూ రోజుకు ఏడుగురు సాక్ష్యులను న్యాయస్థానం విచారణ చేయనుంది. సాక్ష్యుల స్టేట్మెంట్ రికార్డు అనంతరం, పోలీసులు సేకరించిన ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్, డీఎన్ఏ నివేదికలు పరిశీలించిన తర్వాత జనవరి మొదటివారంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా గత నెల 24న దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. చదవండి: ‘సమత’ హత్యాచార కేసులో ప్రత్యేక కోర్టు 'సమత' పిల్లలకు ఉచిత విద్య ‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య -
నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు
-
సమత కేసు: ఆధారాలు లేవు
సాక్షి, ఆదిలాబాద్: సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసు విచారణ ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో శరవేగంగా సాగుతోంది. నాలుగు రోజు గురువారం ఈ కేసులోని ముగ్గురు నిందితుల వాంగ్మూలాన్ని కోర్టు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు గురువారం మరోసారి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక, ఈ కేసులో నిందితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది రహీంను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వాదించేందుకు ఆయన అంగీకరించిన సంగతి తెలిసిందే. రహీం గురువారం నుంచి నిందితుల తరఫున కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, మెడికల్ ఎవిడెన్స్ కూడా లేనందున తమపై కేసును డిశ్చార్జ్ చేయవలసిందిగా నిందితుల తరఫున పిటిషన్ వేయనున్నట్లు లాయర్ రహీం తెలిపారు. ఇక, నేటినుంచే కేసు కోర్టులో ట్రయల్‌కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కాగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను అదే నెల27న పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి పేరును ‘సమత’గా మార్చిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీఎన్ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్లకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘సమత’ కేసు నిందితుల తరఫు న్యాయవాది రహీం -
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స్ జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు జీవో విడుదల చేశారు. ఫాస్ట్‌కోర్టుకు సంబంధించిన ఆదేశాలను న్యాయశాఖ ఈ ఏడాది ఇప్పటికే వెలువరించినా అందులో రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించలేదు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ సెషన్స్ జడ్జి నేతృత్వంలో నిర్వహించే ప్రత్యేక న్యాయస్థానం కిందకు వస్తాయని పేర్కొన్నారు. 2016లో దాఖలైన ఓ రిట్ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసినట్లు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. -
రెండేళ్లైనా.. మాయని మచ్చ!
► రిషితేశ్వరి కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటులో జాప్యం ► అమలుకు నోచుకోని చంద్రబాబు హామీ ► ఇప్పటివరకు ర్యాగింగ్ దోషులకు పడని శిక్ష సాక్షి, వరంగల్: ర్యాగింగ్ పేరిట వేధించి తమ కూతురు మరణానికి కారణమైన వ్యక్తులు ఏవేని కారణాలతో శిక్ష నుంచి తప్పించు కుం టారేమోనని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూలై 14తో రిషితే శ్వరి మరణించి రెండేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆవేదనను రిషితేశ్వరి తల్లి దం డ్రులు ఎం.మురళికృష్ణ, దుర్గాబాయి ‘సాక్షి’కి తెలిపారు. ఆవేదన వారి మాటల్లోనే.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి నాగా ర్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి 2015 జూలై 14న క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకుంది. జూలై 30న ఏపీ సీఎం చంద్రబాబును కలి శాం. ‘దోషులకు శిక్ష పడాలి. మరొకరు ర్యా గింగ్ పేరుతో జూనియ ర్లను వేధించకూడదు. క్యాంపస్‌లో తొలి ఏడాది విద్యార్థులు నవ్వుతూ చదువుకోవాలి’ అని మేం చంద్ర బాబుకు చెప్పాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసు నీరుగారిపోతోంది రిషితేశ్వరి కేసులో ముగ్గురు సీనియర్లు ముద్దాయిలుగా ఉన్నారు. ఆమె స్నేహితులు సాక్షులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మూడో ఏడాది రెండో సెమిస్టర్లో ఉన్నారు. మరో రెండునెలల్లో ఫైనల్ ఇయర్లోకి వెళ్తారు. సాధారణంగా బీఆర్క్ చేసిన విద్యా ర్థులు విదేశాల్లో ఎంఆర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. సాక్షులుగా ఉన్న వ్యక్తులు విదే శాలకు వెళితే కోర్టు విచారణకు హజరు కావడం కష్టం. సాక్షులు లేకపోతే ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలి. మిడిల్ మేనేజ్మెంట్తో సమస్య రిషితేశ్వరి మరణం తర్వాత నాగార్జున క్యాంపస్‌లో సీసీ కెమెరాలు పెట్టారు, ర్యాగింగ్ నిరోధానికి టోల్‌ఫ్రీ నంబరు అందు బాటులోకి తెచ్చారు. పై స్థాయిలో ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు రావాలంటే మిడిల్ మేనేజ్మెంట్ సరిగా ఉండాలి. రిషితేశ్వరి చనిపోయాక తొలి వర్దంతికి నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా సదస్సు పెడతామని కోరాం. అధికారులు కేవలం బ్యా చిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్ విద్యార్థుల (200)తో సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. రిషితేశ్వరి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు సంతోషంగా తిరుగుతున్నారు. మేం అనాథల్లా బతుకుతున్నాం. నిన్న విజయ వాడలో ర్యాగింగ్ వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయిందన్న వార్త టీవీల్లో చూసి తల్లడిల్లిపోయాం. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాం. మా రిషితేశ్వరి కళ్ల ముందు కని పించింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అప్పుడే ఇతరుల్లో మార్పు వస్తుంది. తప్పు చేసినా తప్పించుకోవచ్చులే అనే భావన సమాజంలో పెరగడం మంచిది కాదు. -
‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలి’
సాక్షి, ముంబై : అహ్మద్‌నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన దళిత హత్యకాండ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 19 రోజులు గడిచిపోయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. తూర్పు అంధేరీలోని సాకినాకా ప్రాంతంలో కష్టకారి యువ సంఘటన (కెవైఎస్), తెలంగాణ విద్యావంతుల వేదిక మహారాష్ర్ట సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ‘జాదవ్ కుటుంబ హత్యాకాండ ఘటన’పై ఓ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిందితుల ఆస్తులను జప్తు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవైఎస్ అధ్యక్షుడు బి.మురళి, మూల్ నివాసిమాల, కళాకారులు డి.ప్రకాష్, టి.లచ్చన్న గౌడ్, బద్రి పూర్ణచందర్, చాంద్ అహ్మద్, తె.వి.వి. కన్వీనర్లు జి.గంగాధర్ గంగపుత్ర, ఎ.శ్రీనివాస్ రజక్ పాల్గొన్నారు.