సాక్షి, ముంబై : అహ్మద్‌నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన దళిత హత్యకాండ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 19 రోజులు గడిచిపోయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.
తూర్పు అంధేరీలోని సాకినాకా ప్రాంతంలో కష్టకారి యువ సంఘటన (కెవైఎస్), తెలంగాణ విద్యావంతుల వేదిక మహారాష్ర్ట సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ‘జాదవ్ కుటుంబ హత్యాకాండ ఘటన’పై ఓ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిందితుల ఆస్తులను జప్తు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవైఎస్ అధ్యక్షుడు బి.మురళి, మూల్ నివాసిమాల, కళాకారులు డి.ప్రకాష్, టి.లచ్చన్న గౌడ్, బద్రి పూర్ణచందర్, చాంద్ అహ్మద్, తె.వి.వి. కన్వీనర్లు జి.గంగాధర్ గంగపుత్ర, ఎ.శ్రీనివాస్ రజక్ పాల్గొన్నారు.
‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలి’
Published Mon, Nov 10 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement