ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా విక్రయాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 14 షెడ్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బాణాసంచా కాలిపోయింది.
అధికారులు మెదక్ జిల్లా గజ్వేల్లో బాణాసంచా దుకాణాలపై దాడులు నిర్వహించారు. అనుమతి లేని 12 దుకాణాలను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో బాణాసంచా కేంద్రాల్లో పేలుడుకు భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.