crackers shops
-
సన్ సిటీ క్రాకర్ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో మరో కోణం
-
సన్ సిటీ క్రాకర్స్ షాప్ లో అగ్నిప్రమాదం
-
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడులోని శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీపేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. -
అలర్ట్ హైదరాబాద్.. ఢాం ఢాం బంద్!
సాక్షి, సిటీబ్యూరో: కళ్లు మిరుమిట్లు గొలిపే టపాసులు, అధిక శబ్దంతో ధ్వని కాలుష్యం వెదజల్లే క్రాకర్స్‌కు ఈ దీపావళికి చెక్ పడనుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణ హననానికి కారణమవుతున్న భారలోహాల ఆనవాళ్లున్న ఈ టపాసులను అమ్మడం, పేల్చడం చేయరాదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. తాజాగా పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) సైతం ఇవే మార్గదర్శకాలు జారీ చేసింది. లెడ్, లిథియం తదితర భారలోహాలున్న టపాసుల మోత కారణంగా సమీపంలోని పెట్రోలు బంకులకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నగరంలో భారలోహాల ఆనవాళ్లున్న క్రాకర్స్ విక్రయించేవారి గుట్టురట్టు చేసేందుకు పీసీబీ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. తమ పరిశీలనలో ఇలాంటి క్రాకర్స్ పట్టుబడితే సదరు విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ప్రధానంగా చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రాకర్స్‌లోనే భారలోహాల ఆనవాళ్లు బయటపడుతుండడంపై నగరవాసులు, పర్యావేరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనర్థాలెన్నో... లెడ్, లిథియం, యాంటీమోనీ, మెర్క్యురీ, ఆర్సినిక్ తదితర భారలోహాలతో తయారుచేసే ఫైర్‌క్రాకర్స్, మ్యూజికల్ క్రాకర్స్, లూనార్ రాకెట్స్ ఇతరత్రా... టపాసులు పేల్చేవారికి కొద్దిసేపు ఆనందం కలిగించినా, తద్వారా వెలువడే శబ్ద, వాయుకాలుష్యం నగర పర్యావరణ హననానికి కారణమవుతోంది. అంతేకాదు మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావాలు చూపడం తథ్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా అత్యధిక ధ్వనులు వెలువడే క్రాకర్స్ కారణంగా కర్ణభేరికి ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇక అత్యధిక కాలుష్యం వెదజల్లే ఈ క్రాకర్స్ నుంచి వెలువడే పొగ ద్వారా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించే పరిస్థితులు మృగ్యమవుతాయని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశాలకు, కళ్లకు పొగబెట్టే ఈ క్రాకర్స్‌కు చెక్ పెట్టాలని సూచిస్తున్నారు. విదేశీ వద్దు... హైదరాబాద్ నగరంలో భారలోహాల ఆనవాళ్లున్న టపాసులు విక్రయించే దుకాణాలను గుర్తించేందుకు పీసీబీ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. వీటిని విక్రయిస్తూ పర్యావరణ హననానికి కారణమవుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా విదేశాల నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే టపాసుల్లోనే వీటి ఆనవాళ్లుంటున్నాయని చెబతున్నారు. ఈసారి దివ్వెల పండగను అన్ని వర్గాలు కాలుష్య రహితంగా జరపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ టపాసులు కాల్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ రోజే అధికం.. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి రోజున నగర వాతావారణంలో వివిధ రకాల కాలుష్యకారకాల మోతాదు రెట్టింపవుతున్నట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. సూక్ష్మ ధూళికణాల కాలుష్యం సాధారణ రోజుల్లో 34 శాతం మేర నమోదవుతుండగా.. దీపావళి రోజున 61 శాతానికి పెరుగుతున్నట్లు పీసీబీ వెల్లడించింది. సుప్రీంకోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు దీపావళికి ముందు, తరువాత 15 రోజుల వరకు నగరంలో శబ్ద, వాయుకాలుష్యాన్ని శాస్త్రీయంగా లెక్కించి నివేదిక అందజేస్తామన్నారు. -
‘జీరో’జీఎస్టీ :తెల్లకాగితాలపైనే టపాసుల బిల్లులు
సాక్షి సిటీబ్యూరో: ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇవ్వడం తప్పనిసరి. వినియోగదారులు అడగడమూ అవసరం. ‘వినియోగదారుడా మేలుకో.. బిల్లు తీసుకో’, ‘సకాలంలో పన్నులు చెల్లించడం’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలే పరిమితమవుతోంది. నగర మార్కెట్లో దీపావళి సందర్భంగా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా తెల్లకాగితాలపైనే జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. టపాసులపై జీఎస్టీ 18 శాతం ఉండడంతో ఒక్క సంస్థ కూడా బిల్లు రూపేణా వ్యాపారం చేయడం లేదు. చాలా వరకు తెల్లకాగితాలపైనే బిజినెస్ చేస్తూ ‘జీరో దందా’ కొనసాగిస్తున్నాయి. ఇలా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. అన్ని మార్కెట్లలోనూ అంతే... ఉస్మాన్‌గంజ్, సిద్ధిఅంబర్ బజార్, మలక్‌పేట్ ప్రాంతాలు టపాసుల వ్యాపారానికి అడ్డాలు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ హోల్‌సేల్ వ్యాపారం జరుగుతుంది. అయితే అన్ని మార్కెట్లలోనూ బిల్లులు ఇవ్వకుండానే సంబంధిత శాఖ అధికారుల అండదండలతో వ్యాపారులు దర్జాగా జీరో దందా చేస్తున్నారు. కొంతమంది నిజాయతీగా బిల్లులు ఇస్తుండగా... మరికొంత మంది వినియోగదారులు బిల్లులు అడిగినా ఏదో ఓ కాగితంపై రాసిస్తున్నారు. ఈ వ్యవహారమంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసే నడుస్తోంది. దీపావళి సీజన్లో ‘జీరో దందా’ నడిపేందుకు వ్యాపారులు పెద్ద మొత్తంలో మాముళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దారులెన్నో... జీఎస్టీ చట్టం అమలులో ఉన్నా జీరో బిజినెస్‌కు దారులెన్నో ఉన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తోంది. ఎంత పెద్ద మొత్తంలో బిల్లు అయినా తెల్ల కాగితంపై రాసిచ్చేస్తారు. దీనిపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, రిజిస్టర్ నంబర్ కనిపించవు. బిల్లు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతారు. -
ధూం.. ధాం.. దోచుడే!
సంపాదనే లక్ష్యంగా టపాసుల వ్యాపారులు రంగంలోకి దిగారు. అప్పుడే వ్యాపారం ‘రాజకీయ రంగు’ పులుముకుంది. అనంతపురంలో మూడు రోజులపాటు సాగే ఈ వ్యాపారం తారాజువ్వలా దూసుకెళ్లాలనే ఉద్దేశంతో వ్యాపారులంతా ‘రింగ్’ అయ్యారు. ఏదో ఒక రాజకీయ పార్టీ పంచన చేరాలని తహతహలాడుతున్నారు. యథావిధిగా ఆయా ప్రభుత్వ శాఖలకు ముడుపులు ముట్టజెప్పేందుకు కసరత్తు ప్రారంభించారు. సాక్షి, అనంతపురం సెంట్రల్: దీపావళి పండుగ ఈసారి కూడా సామాన్యులకు చుక్కలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల నుంచి అడ్డంగా దోచుకునేందుకు వ్యాపారస్తులు ‘రింగ్’ అయ్యారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకున్ని అధ్యక్షునిగా ఎంచుకోవాలని తీర్మానించారు. దీనిపై రెండు, మూడురోజుల నుంచి భారీస్థాయిలో కసరత్తు జరుగుతోంది. మూడురోజుల క్రితం ఏకంగా త్రీస్టార్ హోటల్లో భారీ విందులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తెరపైకి ఇద్దరు, ముగ్గురు అధ్యక్షులు రావాలని ప్రయత్నాలు చేశారు. చివరకు ఒక వ్యక్తి గట్టిగా నిలబడుతున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల అధ్యక్ష స్థానం చేజిక్కించుకునే అవకాశముంది. టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్స్‌ల కోసం జిల్లా కేంద్రంలో 123, జిల్లా వ్యాప్తంగా 263 మొత్తం 386 దరఖాస్తులు వచ్చాయి. త్వరలో అర్హులైన వారికి లైసెన్స్‌లు మంజూరు చేయనున్నారు. తెరవెనుక అంతా ఆయనే.. టపాసుల వ్యాపారంలో పేరుమోసిన ఓ రాజకీయ నేత ఈసారి కూడా తెరవెనుక నుంచి అంతా తానై నడిపిస్తున్నాడు. అధ్యక్షుడిగా ఎవరుండాలి.. ఎంతెంత వసూలు చేయాలి అని నిర్ణయిస్తున్నాడు. ఇటీవల ఓ లగ్జరీ హోటల్లో జరిగిన టపాసుల దుకాణాదారుల సమావేశం ఖర్చు మొ త్తం ఆయనే భరించారంటే టపాసుల దుకాణంలో ఆయనకు వస్తున్న లాభం ఏపాటిదో ఊహించవచ్చు. ఈసారి మొత్తం దుకాణాదారులను ఒకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతుడైన ఆయన టపాసుల ధరలు ఆకాశానికి అంటేలా నిర్ణయించినట్లు సమాచారం. అందరూ తాను చెప్పిన ధరలకే విక్రయించాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. కమర్షియల్ ట్యాక్స్, తూనికలు కొలతలశాఖ అధికారులను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇందుకోసం అదనంగా వసూలు చేస్తున్నట్లు కొంతమంది వ్యాపారస్తులు వెల్లడించారు. ఎంత సరుకు క్రయవిక్రయాలు జరిపినా రూ. 15వేలు మాత్రమే జీఎస్టీ రూపంలో చెల్లించేలా కమర్షియల్ ట్యాక్స్ అధికారులను ఇప్పటికే తన దారికి తెచ్చుకున్నట్లు తెలిసింది. ఒక అగ్నిమాపకశాఖ అధికారులు లైసెన్స్ మంజూరు కోసం రూ. 5వేలు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాలు ఏర్పాటు చేసేందుకు, మిగిలిన ఖర్చులకు అధ్యక్షునికి రూ. 45వేలు ఇవ్వాలని తీర్మానించారు. దీన్నిబట్టి చూస్తే టపాసుల వ్యాపారంలో ఈసారి కూడా ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. టపాసుల వ్యాపారస్తుల అక్రమాలకు అధికారులు కళ్లెం వేస్తారని భావించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టపాసుల ధరలు చుక్కలంటడం ఖాయంగా కనిపిస్తుండడంతో సామాన్యుల ఇంట తారాజువ్వల వెలుగులు కనిపించడం గగనంగా మారనుంది. -
ఆసిఫాబాద్ బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా విక్రయాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 14 షెడ్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బాణాసంచా కాలిపోయింది. అధికారులు మెదక్ జిల్లా గజ్వేల్‌లో బాణాసంచా దుకాణాలపై దాడులు నిర్వహించారు. అనుమతి లేని 12 దుకాణాలను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో బాణాసంచా కేంద్రాల్లో పేలుడుకు భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.