రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు! | The announcement of survey details in the latest Status of Tigers 2022 report | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు!

Published Sun, Apr 23 2023 4:10 AM | Last Updated on Sun, Apr 23 2023 9:03 AM

The announcement of survey details in the latest Status of Tigers 2022 report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెద్ద పులులు సందడి చేస్తున్నాయి. తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లు కలిపి 2018 టైగర్‌ సెన్సస్‌లో 26 పులుల జనాభాతో పోల్చితే తాజాగా 2022లో చేసిన సెన్సెస్‌లో వాటి సంఖ్య 30కు పైగా చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంఖ్యాపరంగా ఇది ఎంతో వృద్ధి చెందినట్టుగా భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మైసూరులో ప్రధాని మోదీ ‘50 ఇయర్స్‌ ఆఫ్‌ టైగర్‌ ప్రాజెక్ట్‌’పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘స్టేటస్‌ ఆఫ్‌ టైగర్స్‌ 2022’సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ సర్వేలో ‘పులుల ఉనికి’, అవి స్థిరనివాసం ఏర్పరుచుకోడానికి అమ్రాబాద్‌లో అత్యంత సానుకూల పరిస్థితులున్నట్టు వెల్లడైంది.

పులుల కదలికలు, ఇతర అంశాలను తెలియజేసే మ్యాప్‌ల్లోనూ అమ్రాబాద్‌లో పులుల మనుగడ, సంరక్షణకు ఆరోగ్యకరమైన వాతావరణమున్నట్టు స్పష్టమైంది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులులు తగ్గిపోయినట్టు తెలుస్తోంది.  

అమ్రాబాద్‌ వెరీగుడ్‌లోకి..  
గతంలో గుడ్‌ కేటగిరీలో ఉన్న అమ్రాబాద్‌ వెరీగుడ్‌లోకి, కవ్వాల్‌ గుడ్‌ కేటగిరిలోనే కొనసాగినట్టు వెల్లడైంది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ నిర్వహణకు సంబంధించిన మరి కొన్ని పాయింట్లు సాధించి ఉంటే వెరీగుడ్‌ కేటగిరిలోకి వెళ్లి ఉండేదని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.

2018లో అమ్రాబాద్‌లో 18, కవ్వాల్‌లో 8 పులులు ఉన్నట్టుగా అప్పటి నివేదిక ద్వారా తెలిసింది. 2022 నాటికి ఒక్క అమ్రాబాద్‌లోనే 26కు పైగా పెద్దపులులు (4 పులి పిల్లలతో సహా), కవ్వాల్‌లో, టైగర్‌ కారిడార్‌ ఏరియాలు కలిపి ఆరేడు పెద్దపులులు ఉండొచ్చునని అధికారులు, నిపు­ణు­లు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తంగా చూస్తే పులుల సంఖ్య వృద్ధితో పాటు వాటికి పరిరక్షణకు అనుకూల వాతావరణముందని సాక్షికి అటవీశాఖ వైల్డ్‌ లైఫ్‌ ఓఎస్డీ ఎ.శంకరన్‌ తెలిపారు. కాగా,  అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ వెరీగుడ్‌ నుంచి ఎక్స్‌లెంట్‌ కేటగిరీలోకి వెళ్లేందుకు బేస్‌క్యాంప్‌ల సంఖ్యను గణనీయంగా పెంచాల్సి ఉందని డీఎఫ్‌వో రోహిత్‌ గొప్పిడి అభిప్రాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement