దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1,030 మంది ఉన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను చూస్తే 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, అమరావతి
దేశంలో పట్టణాలు ,గ్రామాల్లో పరిస్థితి ఇది
దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 941 మంది స్త్రీలు
పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 947 మంది స్త్రీలు
ఏపీలో పరిస్థితి ఇది
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,030 మంది స్త్రీలు
పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 మంది స్త్రీలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,035 మంది స్త్రీలు
Comments
Please login to add a commentAdd a comment