Males
-
రాష్రంలో మహిళలే ఎక్కువ
దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1,030 మంది ఉన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను చూస్తే 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, అమరావతి దేశంలో పట్టణాలు ,గ్రామాల్లో పరిస్థితి ఇది దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 941 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 947 మంది స్త్రీలు ఏపీలో పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,030 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,035 మంది స్త్రీలు -
ప్రాణహిత ప్రాణం తీసిన కేసీఆర్
కౌటాల: ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించకుండా ప్రాణం తీసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్‌పై అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆదివారం మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ప్రాణహిత పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధర్యంలో పిండప్రదానం చేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కౌటాల మండల కేంద్రంలోని ఆరే సంక్షేమ సంఘం భవనంలో అఖిలపక్ష ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మించి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలలో ఐదు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. గుండా మల్లేష్ మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నిర్మించవద్దని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి మహనీయుడిని అవమానించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారు : నైనాల గోవర్ధన్ సీఎం కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారని తెలంగాణ జలసాధన సమితి రాష్ట్ర నాయకుడు నైనాల గోవర్దన్ అన్నారు. కేసీఆర్ తన సొంత జిల్లా అభివృద్ధి కోసం లక్ష కోట్ల నిధులతో కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారన్నారు. ప్రాణహితను తుంగలో తొక్కిన కేసీఆర్ : కేవీ ప్రతాప్ ప్రాణహిత ప్రాజెక్టుతో రెండున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దానిని తుంగలో తొక్కారని ప్రాణహిత ప్రాజెక్టు పరిరక్షణ వేదిక కన్వీనర్ కేవీ. ప్రతాప్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నాలుగేళ్లలో తట్టెడు మట్టి తీయలేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్‌ను వెంటనే నిర్మించి ఐదు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో మట్టికొట్టిన సర్కారు : పాల్వాయి హరీశ్‌బాబు ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించకుండా రైతుల నోట్లో మట్టికొట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని నియోజకవర్గ నాయకులు పాల్వా యి హరీష్‌బాబు అన్నారు. కాలువలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించారన్నారు. అనంతరం ప్రాజెక్ట్‌ను వెంటనే నిర్మించాలని ఆయా సంఘాల నాయకులు ప్రతిజ్ణ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు టీ.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎండీ.చాంద్‌పాషా, జిల్లా నాయకులు మేకల రామన్న, ఎ.లాల్‌కుమార్, అంబాల ఓదెలు, మండల నాయకులు బండి రాజేందర్‌గౌడ్, దుర్గం మోతిరాం, విఠల్, బావూజీ, శ్రీనివాస్, ప్రశాంత్, తిరుపతిరావు, తిరుపతి, చందు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిలో ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తున్న అఖిలపక్ష నాయకులు -
మగాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు!
పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఇకపై మహిళలు మాత్రమే మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పురుషులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో, ఇప్పుడు పురుషులకూ గర్భ నిరోధక మాత్రలు వస్తున్నాయి. మగాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకూ బోలెడన్ని ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. చివరకు డైమిథడ్రోలోన్ అండీకానోయేట్ అనే రసాయనం దీన్ని సాధ్యం చేసింది. దీని సామర్థ్యం, భద్రతపై జరిగిన తొలి పరీక్షలు విజయవంతం కావడంతో మలిదశ ప్రయోగాలకు రంగం సిద్ధమైంది. చాలామంది పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ఇష్టపడరని.. అవసరమైనప్పుడు మాత్రమే ఇలాంటి సామర్థ్యమున్న పద్ధతి కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన శాస్త్రవేత్త స్టెఫానీ పేజ్ తెలిపారు. తొలిదశ ప్రయోగాల్లో తాము వంద మంది పురుషులను ఎంచుకుని మూడు వేర్వేరు మోతాదుల్లో మందు అందించామని, అత్యధిక మోతాదు తీసుకున్న వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా మందగించినట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఈ మాత్రల వినియోగం వల్ల శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ కొంత నష్టపోవడంతో పాటు కొద్దిగా ఒళ్లు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసిందన్నారు. -
వీరు వారయ్యారు!
ట్రెండ్ మనకున్న బలమైన అభిప్రాయాల్లో ఒకటి... మహిళలు అద్దం ముందు ఎక్కువ సమయాన్ని గడుపుతారని. అయితే ఈ అభిప్రాయానికి ఇక కాలం చెల్లినట్లే... ఎందుకంటే ఇప్పుడు అద్దం ముందు ఎక్కువ సమయాన్ని ఆడవాళ్ల కంటే మగవాళ్లే గడుపుతున్నారు. యార్క్‌షైర్(ఇంగ్లండ్)కు చెందిన ‘ఎవజ్’ అనే లైఫ్‌స్టయిల్ బ్రాండ్ బ్రిటన్‌లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలిసిన విషయం ఏమిటంటే రోజులో మగవాళ్లు కనీసం 23 సార్లు అద్దం ముందు నిల్చొని తమ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నారని, దీనికి విరుద్దంగా మహిళలు మాత్రం రోజుకు 16 సార్లు అద్దం ముందు నిల్చుంటున్నారని. మగవాళ్లలో ఎక్కువ మంది అద్దం ముందు నిల్చొని తమ బాడీ పార్ట్స్‌ను చూసుకొని మురిసిపోతున్నారు. 38 శాతం మంది మగవాళ్లు తరచుగా తమ తలకట్టును చూసుకుంటున్నారు. 43 శాతం తమ కళ్లను చూసుకుంటున్నారు. 49 శాతం అద్దంలో తమ చిరునవ్వును చూసుకుంటున్నారు. 76 శాతం మంది తమ కండలను చూసుకుంటున్నారు. కొందరైతే రోజుకు 30 సార్లు అద్దం ముందు నిలుచుంటూనే ‘తప్పు చేస్తున్నానేమో’ అని చిన్నపాటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మగాళ్లకే బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు వస్తాయి?
సాధారణంగా ఆడవాళ్లకన్నా మగవారికే బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువ వస్తాయి. దీనికి కారణం మగవాళ్లలో క్యాన్సర్ నిరోధక ప్రొటీన్ లోపమేనంటున్నారు శాస్త్రవేత్తలు. వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో క్యాన్సర్ ను నిరోధించే రిటినో బ్లాస్టోమా ప్రొటీన్ మగవారిలో తక్కువగా ఉంటుందని తేలింది. మగవారి మెదడు కణాల్లో ఈ ప్రోటీన్ తక్కువగా ఉంటుందట. దీని వల్లే వారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఈ ప్రోటీన్ లేనందున మగపేషంట్ల చికిత్స కూడా అంత ప్రభావాత్మకంగా ఉండదంటున్నారు నిపుణులు. ఆడవారిలో ఈ ప్రోటీన్ ను నిరోధిస్తే వారిలోనూ మెదడు క్యాన్సర్ కలుగుతుందని కూడా వారు కనుగొన్నారు. ఇప్పుడు లింగ భేదాలను కలుగజేసే సెక్స్ హార్మోన్ల పనితీరుకి ఈ ప్రోటీన్ లభ్యతకి మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. -
మగవారి సరికొత్త సమస్య
జీవన విధానం మారడంతో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుత యువత జీవన శైలి మారిపోయింది. అంతేకాకుండా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ వారి దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలతోపాటు మగవారిలో కూడా సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం సర్వసాధారణమైపోయింది. దాంతో సరైన వయసులో పెళ్లి కాక, పెళ్లైనవాళ్లలో కూడా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తులున్నాయి. సంతానలేమితో బాధపడేవారిలో మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి. ఇది కేవలం అపోహ మాత్రమే. సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండే అవకాశం ఉంది.అసలు పురుషుల్లో సంతానలేమి ఎందుకు వస్తుంది? ఈ సమస్యను నిరోధించే మార్గాలేంటి? అనేది పరిశీలిస్తే ... కాలంతో పాటు పరిగెడుతున్న జీవితాలు, నిత్యం పలుసమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం కారణంగా సంతాన లేమి సమస్య తెలెత్తుతున్నట్లు నిర్ధార్ధించారు. మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం కష్టమే. మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. భార్యాభర్తలు ఏ గర్భనిరోధక సాధనం వాడకుండా ఒక సంవత్సర వైవాహిక జీవితం కొనసాగించిన తరువాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేదా సంతానలేమి అంటారు. ఈ సమస్య ఇప్పుడు మగవారిలో అధికంగా పెరిగిపోతోంది. ఆధునిక జీవన విధానం మగవారిలో ఈ సమస్యను పెంచుతోంది. సంతానం కలగచేసే సామర్థ్యం పురుషుల్లో క్షీణిస్తోంది. వారిలో వీర్య సామర్థ్యం తగ్గిపోతోంది. దానినే మేల్ ఫెర్టిలిటిగా పేర్కొంటున్నారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు. ప్రతి మగవారిలో సాధారణంగా 3-6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. 80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి. మామూలు వీర్యంలో దాదాపు 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలుంటాయి. పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు. సాధారణంగా సంతాన సాఫల్య సమస్యలను పరిశీలిస్తే మగవారిలో 40 శాతంగా ఉంటుంది. ఇద్దరిలో కలిపి 10 శాతం సమస్యలు ఉంటే, తెలియని కారణాలు 10 శాతం ఉంటాయి. మగవారిలో ఇన్ఫెర్టిలిటీ సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయి. హార్మోన్ల లోపం, మానసిక ఒత్తిడి, వెరికోసిల్ ఒక రకం కారణాలు ఐతే, ధూమపానం, మద్యపానం మరోరకం కారణాలుగా వైద్యులు నిర్ధారించారు. బీజంలో వివిధ ఇబ్బందులు, అంగస్థంభన సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల ఇన్ఫెర్టిలిటీ తలెత్తుతుంది. ఇన్ఫెర్టిలిటీ సమస్యను తెలుసుకోవడానికి పలు పరీక్షలున్నాయి. ఆ పరీక్షల ద్వారా కారణం తెలుసుకొని వైద్యుల సలహాపై తగిన మందులు వాడితే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది.