మగవారి సరికొత్త సమస్య | New problem of Males | Sakshi
Sakshi News home page

మగవారి సరికొత్త సమస్య

Published Sat, Feb 8 2014 4:22 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

మగవారి సరికొత్త సమస్య

మగవారి సరికొత్త సమస్య

జీవన విధానం మారడంతో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుత యువత జీవన శైలి మారిపోయింది. అంతేకాకుండా వారు  తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ వారి  దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలతోపాటు మగవారిలో కూడా సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం  సర్వసాధారణమైపోయింది. దాంతో సరైన వయసులో పెళ్లి కాక, పెళ్లైనవాళ్లలో కూడా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తులున్నాయి. సంతానలేమితో బాధపడేవారిలో మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి. ఇది కేవలం అపోహ మాత్రమే. సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండే అవకాశం ఉంది.అసలు పురుషుల్లో సంతానలేమి ఎందుకు వస్తుంది? ఈ సమస్యను నిరోధించే మార్గాలేంటి? అనేది పరిశీలిస్తే ... కాలంతో పాటు పరిగెడుతున్న జీవితాలు, నిత్యం పలుసమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం కారణంగా  సంతాన లేమి సమస్య తెలెత్తుతున్నట్లు నిర్ధార్ధించారు.  మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం కష్టమే. మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. భార్యాభర్తలు ఏ గర్భనిరోధక సాధనం వాడకుండా ఒక సంవత్సర వైవాహిక జీవితం కొనసాగించిన తరువాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేదా సంతానలేమి అంటారు. ఈ సమస్య ఇప్పుడు మగవారిలో అధికంగా పెరిగిపోతోంది. ఆధునిక జీవన విధానం మగవారిలో ఈ సమస్యను పెంచుతోంది. సంతానం కలగచేసే సామర్థ్యం పురుషుల్లో క్షీణిస్తోంది. వారిలో వీర్య సామర్థ్యం తగ్గిపోతోంది. దానినే మేల్‌ ఫెర్టిలిటిగా పేర్కొంటున్నారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు.  ప్రతి మగవారిలో సాధారణంగా 3-6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. 80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి. మామూలు వీర్యంలో దాదాపు 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలుంటాయి. పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు. సాధారణంగా సంతాన సాఫల్య సమస్యలను పరిశీలిస్తే మగవారిలో 40 శాతంగా ఉంటుంది. ఇద్దరిలో కలిపి 10 శాతం సమస్యలు ఉంటే, తెలియని కారణాలు 10 శాతం ఉంటాయి.

మగవారిలో ఇన్‌ఫెర్టిలిటీ సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయి. హార్మోన్ల లోపం, మానసిక ఒత్తిడి, వెరికోసిల్ ఒక రకం కారణాలు ఐతే,  ధూమపానం, మద్యపానం మరోరకం కారణాలుగా వైద్యులు నిర్ధారించారు.  బీజంలో వివిధ ఇబ్బందులు, అంగస్థంభన సమస్యలు,  పుట్టుకతో వచ్చే లోపాల వల్ల ఇన్‌ఫెర్టిలిటీ తలెత్తుతుంది. ఇన్‌ఫెర్టిలిటీ సమస్యను తెలుసుకోవడానికి పలు పరీక్షలున్నాయి. ఆ పరీక్షల ద్వారా కారణం తెలుసుకొని వైద్యుల సలహాపై తగిన మందులు వాడితే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement