Psychological stress
-
తుపాకీ ‘గురి’ తప్పుతోంది!
ఒకవైపు ఉద్యోగంలో ఒత్తిళ్లు... మరోవైపు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు. ఇవన్నీ ఖాకీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయుధ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారిపోయి విచక్షణ కోల్పోతున్నారు. విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఆ మానసిక స్థితిలో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు. లేదంటే తమను తాము కాల్చుకుని ఎంతో విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని విషాదాంతం చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు ఇలా ఎందుకు చేస్తున్నారు? సాక్షి, హైదరాబాద్ :ఇటీవల జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విష యం తెలిసిందే. తన మతిలేని చర్యతో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ టికారామ్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు బలయ్యారు. వీరిలో హైదరాబాద్ బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఉన్నారు. సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్‌శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. 13 ఏళ్లలో 1,532 మంది.. ♦ గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2023)లోనూ జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 71 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వీటిని నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో నమోదైన పోలీసు ఆత్మహత్యలు కొన్ని... ♦ జనగాం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ గత ఏప్రిల్ 6న తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు ఉదయం శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తట్టుకోలేకే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ♦ 2016లో ఆదిలాబాద్ జిల్లా కెరిమెరిలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2019లో హెడ్ కానిస్టేబుల్ డి.ప్రకాశ్ రెడ్డి తన పైఅధికారి సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవనర్మణం పొందారు. ♦ 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీఆర్పీఎఫ్ కానిస్టే బుల్ రూపేషానంద్ కుటుంబ సమ స్యల ఒత్తిడికి లోనై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2020 నవంబర్‌లో సికింద్రాబాద్‌లో ఓ బ్యాంక్ వద్ద గార్డ్ డ్యూటీలో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మధు తుపాకీతో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ♦ 2017 జూన్‌లో సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రెడ్డి తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికారుల వేధింపులే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముంది? ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తోటి సిబ్బందిపై కాల్పులు జరపడానికి కార ణాలు విశ్లేíÙంచేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్‌్కఫోర్స్ కమిటీ గత జనవరిలో ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. అందులో పేర్కొన్న ప్రధా న అంశాలు సర్వీ స్–వ ర్కింగ్ కండిషన్స్, వ్యక్తిగత, కుటుంబ కారణాలు సాయుధ పోలీసుల ఆత్మహత్యలకు, తోటి సిబ్బంది, ఇతరులపై కాల్పులు జరపడానికి కారణమవు తున్నాయని తెలిపింది. శిక్షణ నుంచే అలవాటు చేయాలి.. పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఇప్పటితో పోలిస్తే గతంలోనే విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అప్పట్లో ఒకవైపు శాంతిభద్రతల సమస్యలు.. మరోవైపు నక్సల్ సమస్యలు ఉండేవి. ఇలా అనేక రకాల మేం ఉద్యోగానికి వచ్చిన తొలిరోజుల్లో పనిచేశాం. కానీ కాలంతోపాటు ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు కూడా పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. అయితే ఆ పని ఒత్తిడి ఇటీవలే పెరిగింది కాదు. అయితే, పరిస్థితులను తట్టుకునేంతగా ఇప్పటి సిబ్బంది మానసికంగా ధృడంగా ఉండట్లేదన్నది నా అభిప్రాయం. శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచేలా ప్రత్యేక శిక్షణ అవసరం. మానసిక ఒత్తిడిని తట్టుకునేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలన్నది ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే అలవడేలా యువ అధికారులు, సిబ్బందిని తీర్చి దిద్దాలి. అప్పుడే ఆత్మహత్యలు జరగకుండా నివారించగల్గుతాం అని నా అభిప్రాయం. – నారాయణ, రిటైర్డ్ ఎస్పీ కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముందంటే... ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు... పనిగంటలు పెరగడం, సరైన విశ్రాంతి లేకపోవడం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే విధుల్లో సంతృప్తి లేకపోవడం, అన్నింటికి మించి సాంఘికంగా తమను దూరం పెడుతున్నారన్న భావన పెరగడం, కుటుంబ మద్దతు లేకపోవడం, సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సరైన యంత్రాంగం లేకవపోవడం. పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ సైతం అవసరం ♦ తీరిక లేని ఉద్యోగంతో పని ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ విధుల్లోనూ అనేక రకాల పరిస్థితులను వారు చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. నేను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న వారికి కొన్ని తరగతులు తీసుకున్నాను. శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాలను వారు ఉద్యోగంలోకి వచ్చాక ఆచరిస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉంటే వృత్తిగత జీవితంతోపాటు వ్యక్తిగతంగానూ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. – డా.ప్రజ్ఞ రష్మీ, సైకాలజిస్ట్ -
బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు!
సాక్షి, హైదరాబాద్: మెదడు.. మన శరీరంలోని అత్యంత సంక్షిష్టమైన నిర్మాణం. ఆలోచనలు, కళలు, జ్ఞాపకాలు, సృజనాత్మకత, తార్కిక బుద్ధి ఇలా అనేక విషయాల్లో మనిషిని ఇతర జీవజాతులకన్నా ఉన్నతంగా, విభిన్నంగా నిలుపుతున్న అవయవం. కోట్లాది న్యూరాన్ల కలబోతగా దైనందిన జీవితంలో చురుకైన పోషిస్తూ.. ఇన్ఫర్మేషన్–ప్రాసెసింగ్ పవర్‌హౌస్ పాత్ర పోషిస్తున్న ఓ మినీ సూపర్ కంప్యూటర్. అయితే నేటి ఆధునిక కాలంలో మనలో రోజురోజుకూ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లకు మెదడు సైతం ప్రభావితం అవుతోంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాల్సిన ఆవశ్యకత, ఇవ్వకుంటే కలిగే దుష్ప్రభావాలపై వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటంటే... ►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకుండా బుర్ర బద్దలయ్యేలా పని చేసేందుకు ప్రయత్నిస్తే దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు అంతంత మాత్రమే. ►మెదడు స్పాంజ్ లాంటిది. అది ఎంతవరకు సమాచారాన్ని భద్రపరచుకోగలదో అంతే చేయగలదు. అందువల్ల బ్రెయిన్‌కు నిత్యం రెస్ట్ అవసరమే. ►పనిచేస్తున్న రోజుల్లో మధ్యలో విరామం తీసుకోవడం వల్ల మూడ్ బాగుకావడంతోపాటు పనితీరు, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే అది అనారోగ్య సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఒత్తిళ్లకు కారణమవుతుంది. మెదడుకు విశ్రాంతి కోసం... కేవలం నిద్రలోనే మెదడుకు రెస్ట్ దొరుకుతుందనేది కూడా పూర్తిగా శాస్త్రీయం కాదని నిపుణులు అంటున్నారు. మెదడుకు ఎక్కువగా పని కల్పించకుండా ఉంచడం కోసం వివిధ రకాల ధ్యానాలు చేయడం కూడా సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం... ►ప్రకృతిలో కాసేపు మమేకం కావాలి. ►మెదడు రిలాక్స్ కావడానికి స్నానం కూడా దోహదపడుతుంది. ►రాత్రిపూట 8 గంటల చొప్పున నిద్ర పోనివారు ఉదయం వేళల్లో కాసేపు కునుకు తీసినా మెదడు పనితీరు మళ్లీ చురుగ్గా మారుతుంది. ►ఏదైనా ఓ ఆట ఆడటం లేదా శారీరక శ్రమతోనూ మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ►సెల్ఫోన్లు, సోషల్ మీడియా వాడకానికి రోజూ కాసేపు విరామం ఇవ్వడం ద్వారా కూడా మెదడు విశ్రాంతి పొందుతుంది. నిద్రలో బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిస్తాయి... సుఖనిద్ర సమయంలో బ్రెయిన్ వేవ్స్ (మెదడు కణాలు విద్యుత్ తరంగాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకొనే ప్రక్రియ) నెమ్మదిస్తాయి. ఏదైనా విషయాన్ని 2–3 గంటలపాటు చదివాక కనీసం 15–20 నిమిషాలు నిద్రపోవడమో లేదా కళ్లు మూసుకొని మౌనంగా ఉంటే అది బాగా గుర్తుండిపోతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం), నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్‌ఆర్‌ఈఎం) అనే పద్ధతులుంటాయి. ఆర్‌ఈఎంలో కలలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగ అంశాల వంటివి ప్రాసెస్ అవుతాయి. మనం మెలకువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆదే యాక్టివిటీ కొనసాగుతుంది. నాన్ ఆర్‌ఈఎంలో అవి సరిగ్గా ప్రాసెస్ కాక మనసు కలతచెందేలా భంగం కలిగిస్తుంటాయి. బాగా నిద్రపోయినప్పుడు ఆయా అంశాలను క్రమపద్ధతిలో పెట్టేందుకు మెదడు పనిచేస్తుంటుంది. నాన్ ఆర్‌ఈఎంలో నిద్ర సరిగ్గా పట్టక జ్ఞాపకశక్తి తగ్గడం, భావోద్వేగాలను సరిగ్గా విశ్లేషించకపోవడం వల్ల కలత చెందడానికి కారణమవుతుంది. -
ఆయుధం: మాటతో మానసిక దాడి?!
‘కత్తికన్నా మాటకు పదునెక్కువ’ అంటారు. సన్నిహిత సంబంధాలలో ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ‘మాట’ను మించిన ఆయుధం లేదు. ఒక్క మాటతో తమకు తామే బంధం మధ్య ఇనుప గోడగా మారచ్చు. చట్టం గృహహింసను మాత్రమే నేరంగా పరిగణించినప్పటికీ మానసిక దాడి అంతకుమించిన పరిణామాలకే దారితీస్తుందని, బంధాల నడుమ ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కోవిడ్ సమయం నుంచి కుటుంబ బంధాలలో పెరుగుతున్న మానసిక దాడి గురించి .. నియంత్రించుకోదగ్గ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు నిపుణులు. ’ది రోల్ ఆఫ్ జెండర్ అండ్ ఏజŒ 2020æఅధ్యయనం ప్రకారం గృహహింసలో శారీరక దాడికి సమానమైన భావోద్వేగ దుర్వినియోగం తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ► జోక్ చేస్తున్నామా... భాగస్వామిని జోక్‌గా ఓ మాట అనాలనుకోవచ్చు. కానీ, జోక్స్ కూడా కొన్నిసార్లు చెడు పరిమాణాలకు దారి తీయవచ్చు. ఉదాహరణకు.. ‘ఎందుకంతగా తింటావు.. ఇప్పటికే ఏనుగులా అయ్యావు. ఇంకెంతవుతావు’ ఇలాంటి రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలు సాధారణంగా భాగస్వామి ప్రవర్తనను నియంత్రించడానికి సంకేతంగా వాడుతారు. ► ప్రమాదకరమే శారీరక లేదా లైంగిక హింసను అనుభవించిన వారి కంటే మానసికంగా బాధింపబడిన వ్యక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన, ఒత్తిడి, కించపరిచిన వ్యక్తిత్వానికి గురవుతున్నారని తెలిసింది. దీనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. వయసు ప్రకారంగా చూస్తే బాల్యంలో మానసికంగా గాయపడిన వారిలో చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. యవ్వనంలో చాలా మంది వ్యక్తుల ప్రవర్తనపై బాల్యం ముద్ర అలాగే ఉండిపోయింది. లైంగిక, శారీరక వేధింపుల లాగానే భావోద్వేగ దుర్వినియోగం కూడా అత్యంత హానికరం. ► ప్రేమగా అవమానం.. ప్రేమతో అయినా అతను/ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ద్వారా భాగస్వామి తనను తాను ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. తమ విశ్వాసం దెబ్బతింటుంది. ’నువ్వు ఇంత తెలివితక్కువ దానివి అనుకోలేదు...’ చాలా సర్వసాధారణంగా ఇళ్లలో వాడే మాట. ప్రపంచం ముందు తమను తాము గొప్పగా నిరూపణ చేసుకోవడానికి, తమ భాగస్వామిని మానసికంగా నియంత్రించడానికి, చాలా మంది వ్యక్తులు పెట్నేమ్స్తో అవమానకరంగా పిలుస్తుంటారు. ఆ మాటలు చాచి కొట్టినదానితో సమానంగా ఉంటాయి. ► జాప్యమూ లోపమేనా! భాగస్వామిని నియంత్రించడానికి చిన్న చిన్న విషయాలు లేదా వారి పనులను లక్ష్యంగా చేసుకుంటారు. ఉదాహరణకు.. ‘ఈ మాత్రం పని కూడా సరిగ్గా చేయడం చేతకాదా? ఎప్పుడూ లేటేనా..’ లాంటి మాటలు తరచూ అనేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామికి ఏదీ రాదని ఎదుటివారి ముందు నిరూపించాలనుకుంటారు. ► అరిస్తే వింటారా.. చిన్న విషయాలకే భాగస్వామిని కించపరచడం, పళ్లు కొరకడం, తప్పుడు ప్రమాణాలు చేయడం, వస్తువులు పగులకొట్టడం.. లాంటివి బంధాలు బీటలువారడానికి సంకేతాలుగా నిలుస్తాయి. ► తామే గొప్పని.. కొందరికి తమ గొప్పతనాన్ని ప్రతీసారి చాటుకోవాలనిపిస్తుంటుంది. ఉదాహరణకు.. భార్య ఉద్యోగం/వ్యాపారం లో ఏదైనా చిన్న విజయం సాధిస్తే ’నా వల్ల నీకు జాబ్ వచ్చింది. నేను కనికరిస్తే నువ్వు కాలు బయట పెట్టగలుగుతున్నావు. ఇదేమీ నీ గొప్పతనం కాదు’ వంటి మాటలు అనేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అంటారు మానసిక నిపుణులు. చిన్నమాటే.. కానీ, అది పదునుగా మనసుపై దాడి చేస్తుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తిని దూరంగా ఉంచేలా చేస్తుంది. ఒక్కో మాట పడుతున్నప్పుడు అది సమ్మెట దెబ్బలా బంధాన్ని చిధ్రం చేస్తూనే ఉంటుంది. అందుకే, హింస అంటే శారీరకమైనదే కాదు మానసికపరమైనది కూడా అని భావించి, ఎదుటివారిని నొప్పించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త పడటం మంచిది. మాట్లాడే ముందే ఆలోచన శారీరక దాడికన్నా భావోద్వేగపరమైన దాడి చాలా తీవ్రమైనది. ఒక చిన్న పదం చాలా తీవ్ర పరిమాణాలు చూపవచ్చు. ‘నువ్వు ఎందుకూ పనికిరావు’ అనే మాట ఎదుటివారి ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తుంది. దీని వల్ల ఇద్దరి మధ్య బాంధవ్యం పలచబడటం మొదలవుతుంది. మానసిక దాడి కారణంగా ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోయి డిప్రెషన్ బారినపడిన వ్యక్తులను చూస్తుంటాం. కోవిడ్టైమ్లో ఈ సమస్య చాలా ఎక్కువ గమనించాం. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కలిసి ఒకే చోట ఉండేవారు. దీని వల్ల ఒకరినొకరు మాటలు అనుకోవడం కూడా పెరిగింది. ‘మానసిక దాడి’ భార్యభర్తలు, పిల్లలు–పెద్దలు మధ్య ఎక్కువయ్యింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వారు ఒక మాట అనే ముందు నియంత్రణ ఉండాలి. బంధాల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. పెద్దలు ఒకరికొకరు కించపరిచేలా మాట్లాడుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మాట్లాడే ముందే ఆలోచించాలి. ‘ముందు మన మైండ్‌లో నన్నెవరైనా ఇలాగే అంటే ఎలా అనిపిస్తుంది’ అనే ఆలోచన చేయాలి. కోపం వచ్చినప్పుడు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయడం, ఆ ఆలోచనకు అక్కడ కట్ చేసి, మరో విషయంవైపు మైండ్‌ను డైవర్ట్ చేయడం, సహనాన్ని అలవర్చుకోవడం.. వంటివి పాటించాలి. – ప్రొఫెసర్ జ్యోతి రాజ, సైకాలజిస్ట్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రైనర్ – నిర్మలారెడ్డి -
కత్తికి రెండవ వైపు కూడా పదును
రోజా (పేరు మార్చడమైనది) ఆఫీసుకు వస్తూనే కొలీగ్ సురేష్ (పేరు మార్చడమైనది) సీట్ వద్దకు విసురుగా వెళ్లింది. సురేష్ ఆమెను చూస్తూనే సీటులో నుంచి లేచి నుంచున్నాడు. ‘అసలు నీకు బుద్ధుందా! నువ్వు మనిషివేనా!?’ అని సురేష్‌పై విరుచుకుపడింది. ఏం జరిగిందో అక్కడ ఎవ్వరికీ అర్ధం కాలేదు. నువ్వీ ఆఫీసులో ఎలా ఉంటావో చూస్తా! నన్నే కామెంట్ చేసేంత సీనుందా!? నీకు’ ఫ్రెండ్ వీణ వచ్చి నచ్చజెప్పి, తీసుకెళ్లేంతవరకు సురేష్‌ని తిడుతూనే ఉంది రోజా. ‘‘నిన్న ఆఫీసుకు నువ్వు శారీలో వచ్చావు. డ్రెస్‌లో కన్నా చీరలో సూపర్‌గా ఉన్నావ్!’ అంటూ సోషల్‌మీడియా వేదికగా రోజా ఫొటోకు రకరకాల కామెంట్స్ పెట్టాడు సురేష్. దీంతో ఆఫీసులో పెద్ద రాద్ధాంతమే జరిగింది.‘సురేష్ తననే టార్గెట్ చేశాడని, అందుకే తనను నలుగురిలో చులకన చేయడానికే రకరకాల కారణాలు వెతుకుతున్నాడంటూ రుజువులు చూపించింది రోజా. ఈ సంఘటన తర్వాత సురేష్ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆఫీసులో అంతా ప్రశాంతం అనుకున్న రోజాకు నాలుగో రోజు నుంచి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, మెసేజ్‌లు కనపడటంతో తలకొట్టేసినట్టుగా ఉంది. ఆఫీసు టీమ్‌లో ఉన్నప్పుడు సురేష్‌తో సాధారణంగా షేర్ చేసుకున్న విషయాలు, కలివిడిగా దిగిన ఫొటోలు, తన అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాడు.సురేష్ చేసిన ఈ పని మూలంగా రోజాకు వచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది. సురేష్ చర్యలకు తీవ్ర మానసిక వేదనకు గురైన రోజా, డిప్రెషన్‌కు లోనై ఆఫీసు పనిలో చురుగ్గా పాల్గొనలేకపోయింది. రోజాలో వచ్చిన ఈ మార్పేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. భావ వ్యక్తీకరణకు కళ్లెం తప్పదు సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు, ప్రత్యేకించి గొంతుక లేని వ్యక్తులకు చాలా శక్తివంతమైన సాధనం. సమాజంలోని వ్యక్తులతో కలిసిపోవడానికి తమ వ్యక్తిగత వివరాలు, నమ్మకాలు, ప్రాధాన్యతలను స్వచ్ఛందంగా వెల్లడిస్తారు. మనలో చాలామంది సాధారణంగా స్టేటస్‌లను అప్డేట్ చేస్తారు. ఆన్లైన్లో తమ వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. అయితే, మీ ఆన్లైన్ చర్యలు భవిష్యత్తులో విద్యా, వ్యక్తిగత, వృత్తిపరమైన అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ఏ వేధింపు అయినా అది నేరమే. ► వ్యక్తులు, రాజకీయ నాయకులతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పెరుగుతున్నాయనేది వాస్తవం. భద్రత దృష్ట్యా సామాజిక మాధ్యమాలను సెన్సార్ చేసే ఆలోచనలకు పునాది పడిందనే విషయాన్ని విస్మరించకూడదు. ► యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్వేచ్ఛగా ఇచ్చేస్తుంటారు. దీంతో తమ సైట్లలో ఉపయోగించే అన్ని చర్యలను ఇతరులు ట్రాక్ చేస్తారు. తర్వాత ఉపయోగించుకోవడానికి వీలుగా వాటిని దాచిపెట్టుకుంటారు. అంటే మన ప్రతి ప్రవర్తనా అంశం ఇతరులు తమ ఉపయోగాల కోసం సేకరిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా మర్యాదలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఆఫ్‌లైన్ – ఆన్‌లైన్‌ని ఒకే విధంగా పరిగణించాలి. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది యూనివర్సల్ – ఎక్స్ప్రెషన్ కాదు. మీకు హాస్యం కలిగించేది ఇతరులకు హాస్యం కాకపోవచ్చు, కాబట్టి సోషల్ మీడియాలో వ్యక్తీకరణలు జాగ్రత్తగా చేయాలి. ► ఉపయోగంలో లేని మీ అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను లాగ్ ఆఫ్ చేయాలి, మీ స్మార్ట్‌ఫోన్ లో ఇతర నోటిఫికేషన్ ఫీడ్లు వ్యసనాలకు దారి తీయడమే కాకుండా ఇతరత్రా ఆటంకాలకు కారణాలవుతాయి. ► చెడు భావాలను పెంచే, పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించడం వలన మీరు సోషల్ మీడియాలో ప్రతికూల అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. ► ఇప్పటికే మన నిజ జీవితంలో ఎంతో పోటీని ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్ ప్రపంచంలో మనకు అంతకన్నా ఎక్కువ పోటీ అవసరం లేదని గుర్తించాలి. ► ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో, మీ సోషల్ మీడియా కార్యకలాపాల ఆధారంగా ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ► సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇష్టపడని వారు మీ జాబితాలో ఉండవచ్చు. మీరు అలాంటి వారితో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యారనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఆన్లైన్ ప్రపంచంలో విహరిస్తూ మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు.. మీ పుట్టినరోజున 100 లైక్‌లు పొందవచ్చు. కానీ, మీ ఇంట్లో ఒక స్నేహితుడు మాత్రమే మిమ్మల్ని కలిసి అభినందనలు చెప్పచ్చు. ► స్మార్ట్‌ఫోన్ లకు బదులుగా సోషల్ మీడియా ఖాతాలకు లాగిన్ అవ్వడానికి ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం మేలు. ఎందుకంటే ఇది వ్యసనంగా మారే అవకాశాన్ని తగ్గిస్తుంది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Covid Time: నేస్తమా.. నువ్వచట కుశలమా..!
‘సతీష్ ఉద్యోగంతో బాగా బిజీ.. కరోనాతో సగం రోజు డ్యూటీయే గనుక బాగా ఖాళీ దొరికింది. టీవీ బోరు కొడుతోంది. అందులో కరోనా సెకండ్‌వేవ్‌తో ఆత్మీయ మిత్రులు, బంధువులు పిట్టల్లా రాలిపోతుండడం గమనిస్తున్నాడు. మనసు విలవిల్లాడింది. అన్నీ ఉండి అంత్యక్రియలకు కూడా నోచుకోని వారిని.. చివరి చూపు కూడా దక్కని వారిని గమనిస్తున్నాడు. మనసు మొద్దుబారి స్తబ్దత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు పాత మిత్రులు ఫోన్ చేసి కుశలం అడిగారు. తను కూడా బాగా గ్యాప్ వచ్చిన కొందరు ఆత్మీయులకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వారితో మాట్లాడుతుంటే ఏదో తెలియని కొత్త సైన్యం తోడుగా నిలుస్తున్నట్లు అనిపిస్తోంది. నెల రోజులుగా అదే పనిగా బంధుమిత్రుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాడు. ఇక జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కనీస పలకరింపులకు గ్యాప్ రాకుండా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు’. కడప కల్చరల్: కరోనా మనలో చిన్నచిన్న మార్పులు తెస్తోందంటున్నారు పలువురు మనస్తత్వ నిపుణులు. ప్రస్తుత సెకండ్ వేవ్ పరిణామాలను గమనిస్తే పలువురిలో మంచితనం మేల్కొంటోందని పేర్కొంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎంతటి నరకాన్ని చూపించిందో అదేవిధంగా మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేందుకు మార్గం చూపిందంటున్నారు. కరోనా కారణంగా చాలామంది ఇంట్లోనే ఉంటూ నంబర్లు సేకరించుకుని మరీ ఎప్పుడో మరిచిపోయిన బంధుమిత్రులకు ఫోన్లు చేసుకుంటున్నారు. సెకండ్‌వేవ్ నేపథ్యంలో వారి యోగక్షేమాల గురించి వాకబు చేస్తున్నారు. ఈ బంధాలు పునరుద్ధరించుకుంటుంటే అందులోని ఆనందం, వాటి ద్వారా కలిగే ఆత్మస్థైర్యం విలువ తెలిసి వస్తోంది. భౌతిక దూరమంటూ మనుషులు దూరంగా ఉన్నా ఫోన్ ద్వారా మనసులు దగ్గరవుతున్న ఆనందం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కరోనా వల్ల ఆకస్మికంగా అయిన వారినీ, ఉపాధినీ కోల్పోయిన కొందరు తమకు జన్మనిచ్చిన పల్లెతల్లి ఒడికి చేరుతున్నారు. బంధువుల ఆత్మీయత, ఆసరాలతో ఆత్మస్థైర్యం కూడగట్టుకుంటున్నారు. ఉపాధి కోల్పోయిన బంధుమిత్రులకు తిరిగి వారు కుదుట పడేంత వరకు నేస్తాలతో కలిసి వారి ‘జరుగుబాటు’కు సహకరించినప్పుడు వారిలో కనిపిస్తున్న కృతజ్ఞత హృదయాన్ని తడిపేస్తోంది. ఈ ఆనందానికి ఇంకేది సాటి రాదనిపిస్తోంది. పోగొట్టుకున్నదేదో తిరిగి లభిస్తున్నట్లు అనిపిస్తోంది. పైగా పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటున్నామన్న తృపి కలుగుతోంది. ఉరుకులు, పరుగుల జీవన యానంలో మరుగున పడిన ఆ ఆత్మీయతకు తిరిగి దగ్గరవుతుంటే ఏదో తెలియని ఆనందం. ఎలా ఉన్నారు నేస్తమా? సెకండ్ వేవ్‌తో అయిన వారి ఆకస్మిక మరణ వార్తలు మానసికంగా కుంగదీశాయి. ‘ఎవరెప్పుడో’ అన్న సందేహంతో ఉన్నంత వరకు ఉన్నవారితోనైనా ఆత్మీయత పంచుకుని ఆనందం పెంచుకోవాలన్న తపన. ఫలితంగా బంధుమిత్రుల యోగ క్షేమాల గురించి తెలుసుకునే యత్నాలు చేస్తున్నారు. వారితో సంబంధాలను పునరుద్ధరించుకుని ఉపశమనం పొందుతున్నారు. ధనం వల్ల వచ్చే ధైర్యాన్ని కరోనా నీరు గారుస్తుండడంతో (సాటి) మనుషుల విలువ తెలిసి వస్తోంది. తమ వారిని కాపాడుకోలేని నిస్సహాయత కుంగ దీస్తోంది. మిగిలిన వారితోనైనా ఆత్మీయంగా ఉండకపోతే జీవితంలో తమకంటూ ఆనందాన్ని ఇచ్చేందుకు ఒక్క మనిషి కూడా మిగలడన్న ఆందోళన కలుగుతోంది. కుటుంబ సభ్యులందరూ కలిసి బంధుమిత్రులతో వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాల్స్, జూమ్ మీటింగులతో ఒకరినొకరు పలకరించుకుంటూ బంధాలను పదిల పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూ బంధుమిత్రుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండడం విశేషం. కొన్ని కులసంఘాలు, మిత్ర బృందాలు ‘మిత్రులారా..ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త! ఏం అవసరమొచ్చినా ఫోన్ చేయండి’ అంటూ ఆసరాగా నిలిచి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంపై కరోనా మానవ సంబంధాల విలువను పునరుద్ధరించుకునేలా చేస్తోందని, దీన్ని గుణపాఠంగా స్వీకరించి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని, మనిషిగా మెలగాలన్న ధోరణిని మెరుగు పరుచుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. మనిషి విలువ తెలుస్తోంది డబ్బుతో ప్రాణాన్ని కాపాడుకోవచ్చన్నది భ్రమ అని కరోనా సెకండ్ వేవ్ స్పష్టం చేసింది. కుబేరులకు సైతం అంత్యక్రియలు చేయడానికి సొంత మనుషులే ముందుకు రా(లే)కపోవడం ఆలోచన రేకెత్తిస్తోంది. ‘అందరూ బాగుండాలి...అందులో నేనుండాలి’ అన్న భావనలు వస్తున్నాయి. బతికుండగానే బంధుమిత్రులందరితో కలిసిమెలిసి ఉండాలని భావిస్తున్నారు. స్పీడు జీవితంలో కనుమరుగవుతున్న ఆత్మీయ బంధాలను తిరిగి పొందాలన్న తపన పెరుగుతోంది. మనమేం కోల్పోతున్నామో క్రమంగా తెలియవస్తోంది. – ఓ.వెంకటేశ్వర్‌రెడ్డి, సైకాలజిస్టు, కడప చదవండి: కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష -
కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఏదో ఒక తెలియని భయం, ఆందోళన, అభద్రతా భావం ఇప్పుడు అందరినీ ప్రభావితం చేస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా లోలోపల ఏదో టెన్షన్, అసంతృప్తి భావనలు మనసుపై ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కూడా అంతర్గతంగా మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆదుర్దాలకు కారణమవుతున్నాయి. దాదాపు ఏడెనిమిది నెలలు గడిచినా కోవిడ్ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదా జవాబు దొరక్కపోవడంతో వివిధ వర్గాల ప్రజల్లో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటు కోవిడ్ బారిన పడినవారు దాని దుష్ప్రభావాల నుంచి తేరుకునే క్రమంలో ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. (సెకండ్ వేవ్: కరోనా మార్గదర్శకాలు) కరోనా సోకినపుడు పడిన బాధలు, రోగ లక్షణాలు ఇప్పటికీ కొందరిలో తొంగిచూస్తున్నాయి. ఈ వైరస్ ఇంకా సోకని వారు దాని బారిన తామెక్కడ పడతామోనన్న భయాందోళనల్లో బతుకుతున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఇక వైరస్ ముగిసిన అధ్యాయమనే భావనలో ఏ జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న వారున్నారు. దీనికి భిన్నంగా ఇది రాకుండా చూసుకునేందుకు అతి జాగ్రత్తలు తీసుకుంటున్న వారూ ఉన్నారు. ఇవన్నీ వెరసి కొంత శాతం మినహాయిస్తే విభిన్న రంగాలు, వర్గాలకు చెందిన అత్యధిక శాతం మంది ఆందోళనలతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సీనియర్ సైకియాట్రిస్ట్ ఎమ్మెస్ రెడ్డి, సైకాలజిస్ట్ సి.వీరేందర్ తమ విశ్లేషణతో పాటు అనుభవాలను పంచుకున్నారు.. వివరాలు వారి మాటల్లోనే.. ఇప్పుడు మాస్కే వ్యాక్సిన్.. ఏమరుపాటు తగదు! కోవిడ్ మహమ్మారికి ఇప్పట్లో ‘ఎండ్ పాయింట్’అనేది కనిపించడం లేదు. కరోనా బారిన ఇప్పటికే పడినవారు ఒకవైపుండగా, అది ఎప్పుడు సోకుతుందా అన్న భయంతో బతుకుతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తమ కుటుంబంలోనో, దగ్గరి బంధువులో లేక మిత్రులకో కరోనా సోకడమో లేక దానివల్ల వారిలో ఎవరైనా మరణించిన ఘటనలు అధిక శాతం మందిని కలవరపెడుతున్నాయి. ఆప్తుల నుంచో లేక సహోద్యోగుల నుంచో తమకు కరోనా ఎక్కడ సోకుతుందో, చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందేమో, దాని నుంచి బతుకుతామో లేదోనన్న భయాందోళనలు పలువురిని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించిన వార్తలు వినేందుకు, తెలుసుకునేందుకు కూడా కొందరు సిద్ధపడటం లేదు. ఆప్తుల నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు అది ఏ దుర్వార్తో అని ఊహించుకుంటున్న వారూ ఉన్నారు. కరోనా వచ్చి తగ్గాక పలువురు ఆరు వారాలకు మించి ‘యాంగ్జయిటీ, డిప్రెషన్’లను ఎదుర్కొంటున్నారు. (ఈ సమయంలో ఎన్నికలా?) కొంచెం దగ్గు, జలుబు చేసినా ఆందోళన పడేవారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటూ ‘అబ్ససీవ్ కంపల్సీవ్ డిజార్డర్స్’(ఓసీడీ)తో బాధపడుతుంటే.. మరికొందరు 30 ఏళ్ల లోపు వాళ్లు పూర్తిగా రిలాక్సయ్యి బహిరంగ ప్రదేశాలు, ఇతర చోట్ల గుంపులుగా తిరిగేస్తున్నారు. 50 నుంచి 60 శాతం మందే మాస్క్‌లు ధరిస్తున్నారు. పండుగలప్పుడు చాలామంది ఏ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అప్రమత్తంగా ఉండకుండా, మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు పాటించకపోతే 10 నిమిషాల్లోనే వైరస్ సోకే ప్రమాదముంది. భారత్‌లో ఇప్పుడు కేసులు తగ్గినట్టు కనిపిస్తున్నా యూఎస్, ఐరోపాలో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీసం వచ్చే మూడు నెలల పాటు 55 ఏళ్లకు పైబడిన వారంతా ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరో 6 నెలల దాకా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనందున తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించే మాస్క్నే వ్యాక్సిన్గాభావించాలి... (రాబోయే మూడు నెలలు జాగ్రత్త! ) – సీనియర్ సైకియాట్రిస్ట్ ఎమ్మెస్ రెడ్డి సమాజంలో పెరుగుతున్న అశాంతి.. సమాజంలో క్రమంగా అశాంతి పెరుగుతోంది. స్థితిమంతమైన కుటుంబాలు మినహాయించి ఇతర కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగి, అర్థం చేసుకునే పరిస్థితులు తగ్గాయి. ముసలివారి నుంచి పిల్లల వరకు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అన్ని సమయాల్లో అందరూ ఇళ్లలోనే ఉండటంతో దంపతుల మధ్య ‘ప్రైవసీ’సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుత అనిశ్చితి ఎంతకాలం కొనసాగుతుందో తెలియక స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు చిన్న వ్యాపారాలు మొదలుకొని ఒక మోస్తరు వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడం వివిధ వర్గాల ప్రజలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలను ఒక రకమైన అభద్రతా భావానికి గురిచేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులే మరో 3, 4 నెలలు కొనసాగితే అశాంతి మరింత పెరిగి, దొంగతనాలు, కిడ్నాప్‌లు, హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ పరంగా ‘సపోర్టింగ్ మెకానిజం’ఆవశ్యకత ఏర్పడింది. మహిళలు, పురుషుల్లో, పెద్దవారిలో యాంగ్జయిటీ ఏర్పడటంతో పాటు నిద్రలేమి అధిక శాతం మందిని బాధపెడుతోంది. రాత్రి ఆలస్యంగా నిద్ర పోయినా, మళ్లీ ఏ అర్ధరాత్రో నిద్రలేచి కూర్చోవడం, మున్ముందు ఏదైనా ఉపద్రవం రాబోతోందా? ఇంకా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయా అన్న ఆందోళనలో చాలామంది గడుపుతున్నారు. తెలంగాణ, ఏపీల నుంచి మాకు వచ్చే ఫోన్ కాల్స్ ఎక్కువగా ఈ సమస్యలకు సంబంధించే ఉంటున్నాయి. కరోనా వస్తే ఏర్పడే ‘సోషల్ స్టిగ్మా’చాలామందిని భయపెడుతోంది. సమాజం, తెలిసిన వారి దృష్టిలో చులకనై పోతామనే భావనను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. – సైకాలజిస్ట్ సి.వీరేందర్ 10 మంది మహిళల్లో 8 మందిపై దుష్ప్రభావాలు: డెలాయిట్ గ్లోబల్ సర్వే కోవిడ్ మహమ్మారి తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు మహిళలు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా తమ మానసిక స్థితి, వ్యక్తిగత ఆరోగ్యంపై దుష్ప్రభావాలతో పాటు ఆఫీసు, ఇంటి పనులు/రోజువారీ జీవన సమతూకం దెబ్బతిన్నట్లు 82 శాతం మంది తమ పరిశీలనలో వెల్లడించారని డెలాయిట్ గ్లోబల్ సర్వే తెలిపింది. కరోనా కేసులు మొదలయ్యాక చాలా మంది మహిళల పనిచేసే పద్ధతులు, రోజువారీ జీవన విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్టు, కుటుంబ భారం, ఇళ్ల పనుల బాధ్యతలు మరింతగా పెరిగినట్లు 65 శాతం మంది మహిళలు వెల్లడించినట్టు ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్స్‌పై నిర్వహించిన అధ్యయనంలో డెలాయిట్ పేర్కొంది. -
మానసిక వేదనతో బాధపడుతున్నా
‘‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’, ‘మిస్టర్ రాస్కెల్’ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ పాయల్ ఘోష్. తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతూ మందులు తీసుకుంటున్నా. ఎక్కువ మానసిక వేదనకు గురైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. అయితే నేను డిప్రెషన్‌కి గురైనప్పుడల్లా నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధగా ఉంది. తన మరణం నన్ను ఎంతో కలచివేసింది. సమస్యలన్నింటికీ ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదు. మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నా ఫాలోయర్స్‌ని కోరుతున్నాను. మానసిక వేదనలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది. డాక్టర్ సహాయం తీసుకోవాలి. డిప్రెషన్‌లోంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. అంతేకానీ ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అనుకోకూడదు’’ అన్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!
‘‘ప్రతి మనిషి జీవితంలో మానసిక ఒత్తిడి, బాధలు ఉంటాయి. నాకలాంటివి లేవని ఎవరైనా అంటే అబద్ధం చెప్పినట్టే. నేను కూడా చాలా మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ, ఓ సందర్భంలో బాధ, మానసిక ఒత్తిడిలపై పోరాడాలనే కసి ఏర్పడటంతో నా నిర్ణయం మార్చుకున్నా’’ అన్నారు నటి ఖుష్బూ. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఒకానొక దశలో నా జీవితం ఆగినట్లు అనిపించింది. భయం వేసింది. అప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నా. కానీ, నాలోని ధైర్యం నన్ను ఆ నిర్ణయం తీసుకోనివ్వకుండా వెనకడుగు వేసేలా చేసింది. ఆ సమయంలో నా స్నేహితులు దేవదూతల్లా మారారు. నన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యల కోసం విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి? అనుకున్నాను. పరాజయాలకు భయపడలేదు. చీకటిని చూసి బెదరలేదు. నన్ను సమస్యలవైపు నడిపిస్తున్న వాటిని చూసి ఏ రోజూ భయపడలేదు. నన్ను ఓడించి, నాశనం చేయాలనుకుంటున్న సమస్యలకంటే నేనే దృఢమైనదాన్ని అని నిరూపించాలని నిర్ణయించుకున్నా. నాలో పోరాడే శక్తి ఉండటంతో ధైర్యంగా ముందడుగు వేశా. పరాజయాల్ని విజయాలుగా మార్చుకోవడం నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా’’ అన్నారు ఖుష్బూ. -
నేనున్నానని.. నీకేం కాదని
సాక్షి, నేలకొండపల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, బాగా చదువుకునేందుకు వారి ఆటంకాలను అధిగమ విుంచేలా ప్రోత్సహించేందుకు సరికొత్త విధానం అమలు చేస్తున్నారు. మనోధైర్యన్ని నింపి, వారిని మానసికంగా దృఢంగా చేసేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పరీక్షలు, ఫలితాల భయం, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై బలవన్మరానికి పాల్పడకుండా..మేమున్నామంటూ..వ్యక్తిత్వ వికాసంతో వారిలో ధైర్యం నూరిపోయనున్నారు. కళాశాలలోని సీనియర్ అధ్యాపకులే కౌన్సిలర్ల మాదిరి వ్యవహరించేలా, పిల్లలకు చేయూతనిచ్చేలా ఇప్పటికే ఇంటర్మిడియట్ బోర్డు శిక్షణ కూడా ఇవ్వడంతో వారంతా సిద్ధంగా ఉన్నారు. ఫలితంగా జిల్లాలోని 19 జూనియరల్ కళాశాలల్లో వీరు తమ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కౌన్సిలర్లు ఏం చేస్తారంటే..? అధైర్య పడొద్దు.. చక్కగా చదవాలి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా వారిని మానసికంగా సిద్ధం చేస్తారు. తక్కువ మార్కులు వస్తే సబ్జెక్ట్ ఆధ్యాపకుడితో కౌన్సిలర్ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. లోపాలు వివరించి, అధిగవిుంచేందుకు పాటించాల్సిన పద్ధతులను తెలిపి వెన్నుతడతారు. తల్లిదండ్రులను కళాశాలకు పిలిచి..తగిన సూచనలు చేస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా కుంగిపోవద్దని ధైర్యం నూరిపోస్తారు. సానుకూల దృక్పథం, స్థిర ఆలోచనలనుపెంచుకునేలా మారుస్తారు. కుటుంబ పరిస్థితిపై సునిశిత పరిశీలన.. పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడి.. కుటుంబ నేపథ్యం తెలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు, చదువులో ఎలా ఉన్నారు? అనేది ఓ అంచనాకు వస్తారు. వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఏ సబ్జెక్ట్ లో వెనకబడ్డారు? అనే విషయాలను కూలంకశంగా తెలుసుకుంటారు. కాలేజీకి రాకుంటే..కారణాలు తెలుసుకుని పునరావృత్తం కాకుండా సూచనలు చేస్తారు. విద్యార్థులతో భేటీ కళాశాలల్లో రోజు వారి కార్యక్రమాలతో పాటు పిల్లలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అధిక మార్కులు సాధించేందుకు మెళకువలు వివరిస్తారు. జ్ఞాపకశక్తి పెంపు, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి..అనేతదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రతి విద్యార్థితో వ్యక్తిగతంగా మాట్లాడతారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు-19 కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఎంపికైన సీనియర్ అధ్యాపకుల సంఖ్య- 19 రోజూ కౌన్సెలింగ్.. ప్రతిరోజూ కాలేజీకి రాగానే విద్యార్థుల పరిస్థితులను గుర్తిస్తాను. ఎవరైతే డల్లుగా ఉంటారో, మానసిక ఒత్తిడికి గురవుతుంటారో వారిలో ధైర్యాన్ని నింపే విధంగా కౌన్సెలింగ్ చేస్తున్నా. ఇందుకు తగ్గట్టుగా మానసిక నిపుణులు నాకు..వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఆ తరహాలోనే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా. – వై.సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్, నేలకొండపల్లి మనోధైర్యాన్ని కలిగించేందుకే.. మానసిక ఆందోళన, ఒత్తిడి అనేది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగవిుంచేందుకు ఇంటరీ్మడియట్ బోర్డు కౌన్సిలర్లను నియమించింది. ఆత్మ విశ్వాసం పెంపోందించడమే దీని లక్ష్యం. – రవిబాబు, డీఐఓ, ఖమ్మం మార్పు కనిపిస్తోంది.. మా కాలేజీలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ప్రతిరోజూ డల్‌గా ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు చాలా ఫ్రీగా, నమ్మకంగా విషయాలను వివరించగలుగుతున్నారు. – ఎస్ఎన్.శాస్త్రి, ప్రిన్సిపాల్, నేలకొండపల్లి -
సోరియాసిస్‌కు చికిత్స ఉందా?
నా వయసు 38 ఏళ్లు. గత 10 సంవత్సరాలుగా సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో రకాల పూతలు, ఎన్నో మందులు వాడుతున్నా. తగినట్టే తగ్గి మళ్లీ మళ్లీ వస్తోంది. సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిన్ అనేది దీర్ఘకాలిక సమస్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల మంది దీనితో బాధపడుతున్నారని అంచనా. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరినీ బాధించే సమస్య సోరియాసిస్. దీనివల్ల సామాజికంగా కూడా రోగి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మానసిక అశాంతికి దారితీస్తుంది.చాలామంది సోరియాసిన్ను ఒక సాధారణ చర్మవ్యాధిగా భావిస్తారు. కానీ ఇది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు : ►వంశపారంపర్యం ►మానసిక ఒత్తిడి, ఆందోళన ►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు : ►చర్మం ఎర్రబారడం ►తీవ్రమైన దురద ►జుట్టు రాలిపోవడం ►కీళ్లనొప్పులు ►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు : స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స : సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ స్పాండిలోసిస్ తగ్గుతుందా? నా వయసు 47 ఏళ్లు. గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు ►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ►జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ►స్పైన్ దెబ్బతినడం వల్ల ►వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు సర్వైకల్ స్పాండిలోసిస్ : – మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ ►వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స ►రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
హార్ట్ జబ్బులకు హాల్ట్ చెబుదాం
ప్రపంచంలో 1900 కి ముందు గుండెజబ్బులు అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. గుండెజబ్బులతో చనిపోవడం అన్నది కనిపించేదే కాదు. అయితే 1900 నుంచి 1960 వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో గుండెజబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. మిగతా అన్ని రకాల కారణాలతో వచ్చే మరణాలతో పోలిస్తే గుండెజబ్బు మరణాల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. అయితే 1960ల తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో గుండెజబ్బు మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. గుండెజబ్బుకు గల కారణాలూ, దాని లక్షణాలు తెలియడంతో పాటు దాన్ని నివారణ గురించి అభివృద్ధి చెందిన దేశాల వారికి బాగా అవగాహన పెరగడం వల్ల అక్కడ గుండెజబ్బుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో ఆ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ నెల 29న ప్రపంచ గుండె దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే) సందర్భంగా మన దేశంలో గుండెజబ్బుల పరిస్థితి గురించి, వాటిని నివారించే విషయంలో మనం తీసుకోగల జాగ్రత్తలు/నివారణ చర్యల గురించి కాస్తంత విపులంగా పరిశీలిద్దాం. అన్ని విషయాల్లోనూ ఉన్నట్లే... జబ్బులు వాటి నివారణ విషయాల్లోనూ ఒక పరిణామక్రమం ఉంటుంది. ఈ పరిణామక్రమంలోని దశలో అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కానీ దాదాపుగా అన్నిదేశాల్లోనూ మొదటో... తర్వాతో ఇవే దశలు కొనసాగుతాయి. మొదటి దశలో వచ్చే జబ్బులు ఉదాహరణకు ప్రతిదేశంలోనూ మొదట అంటురోగాలు (కమ్యూనికబుల్ డిసీజెస్), పౌష్టికాహార లోపాలతో వచ్చే జబ్బులు బాగా ఎక్కువగా ఉంటాయి. మన అవగాహనతోనూ... మందులను కనుగొనడంతోనూ, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం ద్వారా జీవన నాణ్యతను మరింతగా పెంచుకోవడం వల్ల ఈ జబ్బులు క్రమంగా తగ్గిపోతాయి. కమ్యూనికబుల్ డిసీజెస్‌కు కలరా, ప్లేగు వంటి వాటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక పోషకాహార లోపాల వల్ల వచ్చే వాటికి బెరీబెరీ వంటి జబ్బులు ఉదాహరణగా నిలుస్తాయి. మానవాళి యాంటీబ్యాక్టీరియా మందులు కనుకున్న తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ వంటి కలరా, ప్లేగు వంటివి దాదాపుగా కనుమరుగయ్యాయి. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశల్లోనూ నాణ్యమైన నీటి సరఫరాతో నీరు కలుషితం కావడం వల్ల వచ్చే జబ్బులు తగ్గాయి. అలాగే మెరుగైన ఆహార పంపిణీ వల్ల పోషకాహార లోపంతో వచ్చే జబ్బులన్నీ బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాల్లో పూర్తిగా మటుమాయమయ్యాయనే చెప్పవచ్చు. అయితే భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో అంటురోగాలు ఇప్పటికీ అడపాదడపా ప్రబలుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లాగా మనం వాటిని ఇంకా పూర్తిగా అరికట్టలేకపోయాం. రెండో దశలో వచ్చే జబ్బులు ఆ తర్వాతి వంతు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ది. అంటే ఇవి అంటురోగాలు కాని జబ్బులన్నమాట. ఈ తరహా జబ్బులకు ప్రధానమైన ఉదాహరణగా గుండెజబ్బులను చెప్పవచ్చు. హైబీపీ, డయాబెటిస్ వంటి జీవనశైలికి సంబంధించిన జబ్బులూ ఈ కోవకే చెందుతాయి. అవి మళ్లీ గుండెజబ్బులు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయి. వ్యాధులలో రెండో దశ అయిన ఈ గుండెజబ్బుల నివారణ విషయానికి వచ్చే సరికి... తమ దేశాల్లో మొదటిదశ జబ్బులు లేకపోవడం వల్ల ఆయాదేశాలు గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులపై పూర్తిగా దృష్టిపెట్టగలిగాయి. కానీ మనం ఇంకా అంటురోగులతో పోరాడుతూనే ఉన్నాం. స్వచ్ఛమైన నీటి సరఫరా, దోమల నివారణ, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల కల్పన్న అన్నది భారతదేశంలోని ఇంకా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తిగా జరగనందువల్ల ఒకవైపు మొదటిదశ జబ్బులైన అంటువ్యాధులతో పోరాడుతూనే ఇంకా గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులతోనూ పోరు చేయాల్సివస్తోంది. పైగా భారతదేశంలో పౌష్టికాహారం ఇంకా పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో మొదటిదశలో వచ్చే పౌష్టికాహార లోపాల కారణంగా వచ్చే జబ్బులూ మనదేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. దాంతో పాశ్చాత్యదేశాల కంటే ఈ విషయంలోనూ కాస్తంత వెనకబడే ఉన్నాం. ఫలితంగా మనదేశంలో మొదటి దశ వ్యాధులు పూర్తిగా తగ్గకముందే రెండోదశ వ్యాధులతోనూ ద్విముఖ పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకేసారి ఇద్దరు శత్రువులతో పోరాడుతున్నందున మన అడుగులు తడబడుతూనే సాగుతున్నాయని చెప్పవచ్చు. జన్యుపరమైన అంశాలూ కారణాలేనా? ఇవన్నీ బయటి పరిస్థితుల కారణంగా గుండెజబ్బులకు దోహదపడే అంశాలైతే మరికొన్ని జన్యుపరమైన కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మిగతా జాతీయులతో పోలిస్తే... భారత జాతీయులకు అధికంగా గుండెజబ్బులు వస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అలాగే ఇంగ్లాండ్ వంటి యూరోపియన్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల్లోనే గుండెజబ్బులు ఎక్కువ. పాశ్చాత్యదేశాల్లో స్థిరపడ్డ భారతీయులలో అక్కడి జీవనశైలికి అలవాటు పడ్డవారిలో కూడా భారతీయుల్లో జబ్బులు మరింతగా ప్రబలాయి. ఈ అన్ని పరిశోధనలూ, పరిశీలనల కారణంగా భారతీయుల్లో జన్యుపరంగా గుండెజబ్బులు ఎక్కువగానే వస్తాయని, కాబట్టి భారతీయుల్లో వీటిని నివారణ అంతగా సాధ్యం కాకపోవచ్చని తొలుత అధ్యయనవేత్తలు భావించారు. ఇదీ ఒక ప్రధానమైన ఆశారేఖ కానీ గుండెజబ్బుల విషయంలో మనదేశంలో నిశితంగా పరిశీలిస్తే... పట్టణప్రాంతాల్లో ఉన్న భారతీయులకూ, పల్లెల్లో ఉన్నవారికీ మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం కనబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వ్యాయామం ఉండటంతో పాటు ఒత్తిడి తక్కువగా ఉండే జీవనశైలి, ప్రాసెస్డ్ ఆహారం పట్టణాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండి, పల్లెల్లో లేకపోవడం వంటి కారణాలతో పట్టణవాసుల్లో గుండెజబ్బులు ఎక్కువగానూ, పల్లెల్లో అంతగా లేకపోవడం నిపుణల దృష్టికి వచ్చింది. ఇది ఒక ఆశారేఖ. దీనితో తేలుతున్న విషయం ఏమిటంటే... మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మనం మనకున్న జన్యులోపాలను అధిగమించి గుండెజబ్బులను తగ్గించుకోవచ్చు! ముందుంది ఒక పెనుసవాలు అయితే ఇక్కడ మన ముందు ఒక పెనుసవాలు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పొగతాగే అలవాటు ఎక్కువగానే ఉంది. ఒకప్పుడు పట్టణాల్లో కనిపించే ప్రాసెస్డ్ ఆహారాలు, కూల్డ్రింకులు, జంక్ఫుడ్స్ వంటివి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి. ఈ విషయంలో పట్టణప్రాంతాలకూ, పల్లెలకు ఉన్న తేడా చెరిగిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. అలాగే ఒకసారి శారీరక శ్రమ తగ్గించే వస్తువులు (గాడ్జెట్స్ ఉదాహరణకు మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషిన్ వంటివి), యాంత్రీకరణ వల్ల పల్లెల్లోనూ ఇప్పుడు వ్యాయామం తగ్గిపోతోంది. అలాగే వినియోగదారులు పెరగడం, రవాణా సదుపాయాలు మెరుగుకావడం వంటి అంశాలతో ఇప్పుడు కన్సూ్యమరిజమ్ కారణంగా ప్రాసెస్డ్ ఆహారం లభ్యత కూడా ఇప్పుడు పల్లెల్లో బాగా పెరుగుతోంది. ఇది వేగంగా జరుగుతున్నందున గుండెజబ్బుల విషయంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న తేడా వేగంగా చెరిగిపోవడానికి చాలాకాలం పట్టదు. ఇప్పటికీ మనం మొదటిదశ జబ్బులతోనూ, రెండోదశ వ్యాధులతోనూ ఒకేసారి పోరాడుతున్న ప్రస్తుత నేపథ్యంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న వ్యత్యాసం తగ్గిపోతే మనకిప్పుడు ఉన్న ఆర్థిక వనరులతోగానీ, లేదా వైద్య సదుపాయాల వంటి వనరులుగానీ ఈ తేడా చెరిగిపోవడంతో పెరిగిపోయే వ్యాధిగ్రస్తుల చికిత్సను మనం ఒకేసారి ఎదుర్కోవడానికి మనకున్న సామర్థ్యం పూర్తిగా సరిపోకపోవచ్చు. మన ఆశారేఖను వినియోగించుకోవాలిలా... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గుండెజబ్బుల విస్తృతిలో ఉన్న తేడాలను బట్టి మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండెజబ్బులను అరికట్టుకోవచ్చని తేలింది. కాబట్టి... మనమీ ఆశారేఖను సమర్థంగా వినియోగించుకోవాలి. అందుకు ఈ కింది నివారణ చర్యలు/జాగ్రత్తలు తీసుకోండి. నివారణ పొగ తాగడం మానండి: పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. మీ ఇంట్లో ఎవరికైనా ఆ అలవాటు ఉన్నా, మాన్పించండి. ఒకసారి హార్ట్ ఎటాక్ కానీ, గుండె జబ్బు కానీ వస్తే, దీర్ఘకాలం ఇబ్బంది పెట్టే దానితో బాధపడడం కన్నా, పొగ తాగే అలవాటు మానేయడమే సుఖం. పౌష్టికాహారం తీసుకోండి: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే, పౌష్టికాహారం తీసుకోవాలి. మీరు తినే ఆహారాన్ని బట్టే – ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు రావడం, షుగర్, అధిక బరువు రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ, విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం, ఇతర పోషకాలు ఉంటూనే, క్యాలరీలు మాత్రం తక్కువుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, చేపలు, కాయధాన్యాలు తినాలి. స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు, వేటమాంసం (రెడ్ మీట్) తక్కువ తినాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి: గుండెకు రక్తం తీసుకువెళ్లే రక్తనాళాల్లో కొవ్వు చేరితే, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి, వీలైనంత వరకు శ్యాచురేటెడ్ కొవ్వు పదార్థాల లాంటివి తినకూడదు. ఒంట్లో చెడ్డ (ఎల్.డి.ఎల్) కొలెస్ట్రాల్, మంచి (హెచ్.డి.ఎల్) కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ఎంతెంత స్థాయిలో ఉన్నాయో, ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని, జాగ్రత్తపడాలి. రోజూ శారీరక శ్రమ చేయండి : రోజూ సగటున 45 నిమిషాల చొప్పున, వారానికి కనీసం అయిదారు రోజులు వ్యాయామం చేయాలి. దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బరువు చూసుకోండి : స్థూలకాయం, అధిక బరువు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్థూలకాయం అంటే హై కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, టైప్–2 డయాబెటిస్‌కు ముందు సూచన అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి వస్తాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారితీసేవే. కాబట్టి, సరైన ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి (స్ట్రెస్) తగ్గించుకోండి: గుండె జబ్బులు రావడానికీ, ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికీ స్పష్టమైన సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రెస్‌లో ఉన్నవాళ్లు అతిగా తినడం, ఎక్కువగా పొగ తాగడం లాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే, స్ట్రెస్ వల్ల యువతీ యువకుల్లో మధ్యవయసులోనే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. మద్యపానం మానేయండి : అతిగా మద్యం తాగడం కూడా రిస్కే. దాని వల్ల రక్తపోటు పెరుగుతుంది. కార్డియోమయోపతీ, గుండెనొప్పి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వస్తాయి. గుండెజబ్బుల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఒక్కటే. మనం నివారణకు పెట్టే ఖర్చుతో పోషకాహారాలు, వ్యాయామంతో పోలిస్తే... అది వచ్చాక చికిత్సకు అయ్యే ఖర్చు వందల రెట్లు ఎక్కువ. పైగా నివారణ చర్యలతో గుండెజబ్బులు రాకపోవడంతో పాటు మిగతా జబ్బులూ నివారితమవుతాయి. ఫిట్నెస్ బాగుంటుంది.గతేడాది, ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే థీమ్స్... ‘మై హార్ట్– యువర్ హార్ట్’తో పాటు ‘‘క్రియేట్ ఎ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ హార్ట్ హీరోస్’’. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే... నా గుండెను రక్షించుకోవడం ఎలా... ఎదుటివాళ్ల గుండె ఆరోగ్యానికీ మనం చేయగలిగేదేమిటి?’ అనే చర్యలతో పాటు గుండెను రక్షించే నాయకుల తయారీలో మన కుటుంబాలను భాగస్వామ్యం చేయడానికి... ఇంటిలో వండిన ఆరోగ్యకరమైన వంటలే తినేందుకూ (ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా జంక్‌ఫుడ్ మన గుమ్మం ముందుకే వస్తున్నాయి. మన పిల్లలూ వాటికి దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది).మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆరోగ్యంగా ఉండేందుకు తప్పక వ్యాయామం చేయడంతో పాటు పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు మానేసేందుకు; పిల్లలను సైతం చిన్నవయసు నుంచే వ్యాయామం వైపుకు మళ్లించేందుకు; ఇక ఆరోగ్యరంగంలో కృషి చేసేవారు తమ పేషెంట్స్ పొగతాగడం వంటి అలవాట్లు మానుకునేలాగా, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకునేలా అవగాహన తేవడం; మన విధాన రూపకర్తలు ఆరోగ్యకరమైన వ్యవస్థలను రూపొందించేలా విధానాలు రూపొందించడం; ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం కోసం కృష్టి చేయడంతో పాటు... పైన పేర్కొన్న నివారణ చర్యలను అందరూ పాటించేలా చేయగలిగితే ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్స్‌కు న్యాయం జరిగినట్లే. ఆహారపరమైన జాగ్రత్తలివి ►సాల్మన్ ఫిష్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే మంచిదంటూ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేస్తూ... కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, అవి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం ఉండదు. పైగా అవి కీడు చేస్తాయి కూడా. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్లు లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. జామపండ్ల వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటినీ తినాలి. అయితే వీటిని కొరికి తినాలి తప్ప జ్యూస్‌లుగా చేసుకొని తాగకూడదు. ఏవైనా కారణాలతో కొరికితినలేని వారు జ్యూస్‌లుగా చేసుకొని తాగాల్సివస్తే అందులో పంచదార కలుపుకోకుండా, తాజా జ్యూస్‌లు తాగాలి. ►టొమాటోలలకూ కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. వీటిల్లో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెజబ్బులను నివారిస్తుంది. ►బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బీన్స్, బఠానీల లాంటి కాయధాన్యాల్లో కూడా కొవ్వు చేరనివ్వని బోలెడంత ప్రొటీన్ ఉంటుంది. ►పాలకూర, బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్)లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే. కాబట్టి, అవి గుండెకు మంచిది. ►రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం కూడా గుండెజబ్బుల నివారణకు గణనీయంగా తోడ్పడుతుంది. గుండెజబ్బులు రావడానికి కారణాలు ఇప్పుడు గుండెజబ్బులు వచ్చేందుకు గల కారణాలను చూద్దాం. ఆహారంలో కొవ్వుపదార్థాలూ, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, హైబీపీ, షుగర్ వంటివి కొన్ని ప్రధాన కారణాలైతే... మనకు మనమే జబ్బులకు చేరువయ్యేలా చేసే మన చెడు అలవాట్లైన పొగతాగడం వంటివి ఇంకా గుండెజబ్బుల విషయంలో మనకు చేటు చేసే అంశాలు. ఇక వీటితో పాటు మారిన వృత్తుల నేపథ్యంలో మానసిక ఒత్తిడి బాగా పెరగడం, నిద్రలేమి వంటివి కూడా వచ్చి చేరాయి. డాక్టర్ ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్ -
రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా?
హమియో కౌన్సెలింగ్ నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. హోమియోలో పరిష్కారం ఉందా? – ప్రభాకర్‌రావు, తాడేపల్లిగూడెం మానసికమైన ఒత్తిడి, వ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే వీటివలస కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో–సొమాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చు. అందువల్లనే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ వ్యాధిబారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ–పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు విరుద్ధంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. వ్యాధి లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. అది యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం, పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
మీ కలలు నెరవేరతాయి...
జనవరి 23 నుంచి 29 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొంతకాలంగా మానసిక ఒత్తిడితో, అశాంతితో బాధపడుతున్నవారికి ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. వారి ఆలోచనలను మీరు అవలంబిస్తారు. కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. బహుశ ఈ అవకాశం మీ జీవితాన్ని మలుపు తిప్పేది కావచ్చు. మీ లక్కీ నంబర్ 21. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) విజయవంతంగా, అదృష్టకరంగా నడుస్తుందీవారం. మీ బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలే మిమ్మల్ని శాసించడం లేదా మీ మనస్సును ప్రభావితం చేయడం జరగవచ్చు. కొన్ని విషయాలలో సంప్రదాయాన్ని పాటిస్తూ, పెద్దలు చెప్పిన శాస్త్రీయవిధానాలను అనుసరించడం మంచిది. ఇతరులకిచ్చిన వాగ్దానాల విషయంలో పునరాలోచన అవసరం. మీ వాగ్ధాటి, మాటలలోని చమత్కారం మీకు బాగా ఉపయోగపడతాయి. కలిసొచ్చే రంగు: పగడపు రంగు జెమిని (మే 21-జూన్ 21) మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్వేచ్ఛ లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగం మాని, కొత్త ప్రదేశంలో కొత్త ఉద్యోగం కోసం వెతకాలనుకుంటారు. ట్రావెల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తారు. ఉన్నట్టుండి మీలో ఏదో మార్పు వచ్చి, ఆధ్యాత్మిక విషయాలవైపు మొగ్గు చూపుతారు. జీవితాన్ని సంపూర్ణంగా, స్వేచ్ఛగా జీవించాలని తెలుసుకుంటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. పని మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: ముదురు ఊదా క్యాన్సర్(జూన్22-జూలై 23) ఈ వారమంతా మీకెంతో సామరస్యపూర్వకంగా గడుస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ సంతృప్తి లభిస్తుంది. సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం వస్తుంది. ఎప్పటినుంచో ఉన్న ఒక ఆలోచనను అమలులో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మీలాగే ఆలోచించే మరికొందరిని కలుపుకుని కొత్త వ్యాపారాన్ని లేదా ప్రాజెక్టును చేపడతారు. అయితే కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: లేత పసుప్పచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) జీవితంలో ముందుకు దూసుకెళతారు. ఒక కొత్త వ్యాపారాన్ని చేపట్టే ఆలోచన రావడమే కాదు, దానిని వెంటనే అమలు పరిచి, దాని విజయాన్ని, దానినుంచి మంచి లాభాలను అందుకుంటారు కూడా! దూరప్రాంతానికి ప్రయాణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారాన్ని పెంచుకోకండి. ఒక బంధం విషయంలో అభద్రతాభావాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ధైర్యం అంటే మీ మనసులో ఉన్నదాన్ని నిర్భయంగా చెప్పడం, అవతలివాళ్లు చెప్పేదానిని నిర్భయంగా వినడం కూడా అని విన్స్టన్ చర్చిల్ అన్నట్లుగా ప్రశాంతంగా, నిమ్మళమైన మనస్సుతో ఉండటం, మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది. అయితే నిదానమే ప్రధానం అన్న సూక్తిని అన్ని విషయాల్లోనూ అమలు చేయాలనుకోవడం సబబు కాదు. ప్రేమ విషయంలో నిబ్బరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: నారింజ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) పని చేసీ చేసీ అలసిపోయిన శరీరం, మనస్సు సేదతీరవలసిన సమయమిది. తగినంత విశ్రాంతి లేకపోతే రీఛార్జ్ కాలేరు కదా! డబ్బు గడించడంలో మీ తెలివితేటలను, జ్ఞానాన్ని ఉపయోగించండి. నిష్ఠుర సత్యాల విషయంలో సంయమనాన్ని పాటించండి. మీరూ, మీ ప్రియతములు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.అవివాహితులకు వివాహసూచన ఉంది. సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధ్యానం ద్వారా సత్పలితాలను పొందవచ్చు. కలిసొచ్చే రంగు: పింక్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మన ఆలోచనలే మనం. మనం దేని గురించయితే తీవ్రంగా ఆలోచిస్తామో, చివరికి దానిని పొంది తీరుతాం అంటాడు బుద్ధభగవానుడు. అంటే ఎప్పుడూ ఏదో జరుగుతుందన్న నెగటివ్ ఆలోచనలు బుర్రలోకి రానివ్వకుండా సానుకూల ఆలోచనలతో ఉంటే అంతా మంచే జరుగుతుందని గ్రహించాలన్నమాట. ఒక కొత్త వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ద్వారా లాభాన్ని పొందుతారు లేదా గతంలో పెట్టిన మదుపు నుంచి వడ్డీ లభిస్తుంది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఉల్లాసకరమైన సమయం.అనూహ్యమైన అభివృద్ది... అదీ అతివేగంగా జరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఏదైనా వినోద, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మీరు ఏమి చేసినా, దానిని ఇతరులు కూడా అనుసరించేలా ఉంటుందీవారం. ఒక స్నేహితుని విషయంలో ఉదారంగా వ్యవహరించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారం అకస్మాత్తుగా మొదలవుతుంది. అంతే వేగంగా ముగిసిపోతంంది కూడా! కలిసొచ్చే రంగు: అల్లం రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ వారం మీకు వినోదాత్మకంగా గడుస్తుంది. విందులు, వేడుకలు జరుగుతాయి. ఒక పార్టీకి ఆహ్వానం అందుతుంది. ఆఫీసులో ఒక పనివిషయంలో విభిన్నంగా వ్యవహరించడం వల్ల కొన్ని తీవ్రపరిణామాలను చవి చూడవలసి రావచ్చు. లాభాలు, ఆదాయాల గురించి కంగారు పడవద్దు. మెల్లగా అందుతాయి. రొమాన్స్ విషయంలో కొత్త పంథాను అనుసరిస్తారు. ఉల్లాసం, ఉత్సుకత పరవళ్లు తొక్కుతుంటాయి. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) వ్యాపారం నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కెరియర్ గురించి మీరు బంగారు కలలెన్నో కంటుండవచ్చు అయితే వాటిని కనీసం కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకపోతే ఎలా? మీ ఆలోచనలను వారితో చెబితే వారు కూడా మీకు సాయం చేస్తారు కదా! మీ చిరకాల కోరిక ఒకటి ఈవారం తీరుతుంది. ఇద్దరు పరిణత వయస్కుల మధ్య కొంత కాలంగా సాగుతున్న బంధం ఒకటి దృఢపడుతుంది. కలిసొచ్చే రంగు: మెరుస్తున్న గోధుమ రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పనికి సంబంధించిన సమాచారం లేదా సందేశం అందుతుంది. తేలికగా అయిపోతాయనుకున్న పనులకు కూడా ఎక్కువ శ్రమపడాల్సి రావడం, చిన్న పనికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనలు చేయాల్సి రావడం వంటివి ఉండవచ్చు. అయినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. మనసును దృఢం చేసుకోండి. అప్పుడప్పుడు ప్రకృతిలో గడుపుతూ ఉండండి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. కలలు నెరవేరతాయి. కలిసొచ్చే రంగు: బేబీ పింక్ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చేస్తున్న ప్రతిపనిలోనూ ఉదాశీనతా భావం కలగవచ్చు. యంత్రనిర్మాణం, యంత్రపరికరాలతో చేసే వ్యాపారం వంటిది మీ వృత్తి అయినా, వాహనాలకి సంబంధించిన వ్యాపారమే అయినా కొద్దిగా శ్రద్ధని పాటించవలసిన వారం ఇది. శారీరకమైన ప్రమాదాలు జరక్కుండా భద్రతని గురించిన కొద్ది శ్రద్ధని వహించాలి. వాహనాలు నడపడంలో కూడా జాగ్రత్త అవసరం. ఇది ముందుజాగ్రత్త మంచినదే ఆప్తవాక్యమే. టారస్(ఏప్రిల్ 21-మే 20) శారీరకంగా మీరెంత పనిని చేయడానికైనా వెనుకాడరు. పైగా ఆ పనిలో విజయాన్ని సాధించాననే ఆనందంతో ఉండే మనస్తత్వం కూడా మీది. అయితే శారీరక శ్రమకి తట్టుకోగలిగినంత శక్తి మీకు మీ మనసులో లేని కారణంగా మానసికమైన ఒత్తిడికి గురై శ్రమపడతారు. ముఖ్యంగా మీ గొప్పదనాన్ని గుర్తించలేని, పైగా తప్పుబట్టాలనే ఈర్ష్యాదృష్టితో ఉన్న అధికారుల కారణంగా అలసటకి గురవుతారు. నిరుత్సాహ పడచ్చు. జెమిని (మే 21-జూన్ 21) ఎంతో ధనవంతులమనే అభిప్రాయంతో ఉన్న మీరు ఈ వారంలో మీ ఆదాయం వ్యయం నిల్వ గురించిన పరిశీలనని మీకు మీరే కావాలని చేసుకోవచ్చు. దాంతో కొంత అసంతృప్తికి గురవుతారు. మరింత సంపాదించాలనే అభిప్రాయానికి వస్తారు. విందువిలాసాలనీ, వ్యర్థవ్యయాలనీ ఆడంబరాలనీ దూరం చేసుకోవాలని నిర్ణయిస్తారు. ఒక మంచి అనుభవజ్ఞుణ్ణి మార్గదర్శకుడిగా ఎంచుకుంటారు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) కొత్తవైన ఆస్తులని కొనాలనే బలమైన ఉద్దేశ్యంతో మీ కుటుంబ సభ్యులని రుణం అడుగుతారు. చేసేది మంచిపనే అయినప్పటికీ, సామూహికంగా మీరు కొన్న భూముల్నీ ఇళ్లనీ... అన్ని ఆస్తులనీ అప్పు, వడ్డీ మొత్తం .. ఇలా వివరాలని అద్దంలో చూసుకుంటున్న తీరుగా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరచి మరీ చెప్పండి. దాంతో ఇప్పటివరకూ దాగి ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు మంచిది కూడా. లియో (జూలై 24-ఆగస్టు 23) స్పష్టమైన అవగాహనతో చెప్పదలచిన అంశాన్ని సూటిగా చెప్పగల మీరు లౌక్యంగానూ డొంక తిరుగుడుగానూ వ్యవహారాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది మీ స్వభావానికే విరుద్ధం కాబట్టి నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రవర్తించండి. ఆది నిష్ఠురం ఎప్పుడూ మంచిది తప్ప చివరికొచ్చాక మీ వ్యవహార భాగస్వాములతో అంత్యనిష్ఠురం ఏమాత్రమూ సరైన పద్ధతీ కాదు ఉపద్రవమయం కూడా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ వ్యవహార ప్రణాళిక ముందునుండీ సరైన తీరులో ఉన్న కారణంగానూ దైవానుకూల్యం కారణంగానూ మీ పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్లే పూర్తవుతాయి. స్వదేశీయులు విశేశానికి వెళ్లాలనే బలమైన ఆలోచనతో ఉన్నా కూడా విదేశాలకి వెళ్లలేరు. ఇదొక విధంగా మీకు అనుకూలమే తాత్కాలికంగా. ఉన్నంతోనే సర్దుకుని మనస్సంతోషంగా ఉండాలనే ధోరణి ప్రవేశించబోతోంది తొందరలోనే. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆలోచన ఒక తీరుగా, ఆచరణ మరొక తీరుగా- భయం ఒక దిశగా, ధైర్యం మరొక దిశగా- ఆశ ఒక పక్కగా, నిరాశ మరొక పక్కగా సాగుతూ ఔను- కాదు, జరుగుతుంది- జరగదు అనే ఈవిధమైన రెండుతీరుల భిన్న భిన్న దృక్పథాలతో జరుగుతుంది ఈవారం. నష్టం అవమానం గర్వభంగం... వంటివేమీ ఉండనే ఉండవు కానీ ఈ అన్నీ జరిగినంత ఆందోళన మాత్రం మనసుకి కలగవచ్చు జ్యోతిషం ప్రకారం. ఇప్పటికైనా ప్రతీకార బుద్ధిని మానాలి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రభుత్వం నుండి రావలసిన అనుమతులుగానీ, ఆజ్ఞలుగానీ సకాలంలో అందుతాయి. వారి సహకారం తప్పక లభిస్తుంది. మీ కుటుంబానికి- ముఖ్యంగా దాంపత్యానికి సంబంధించిన వ్యవహారం ఎటూ తేలకుండా అలాగే ఉంటుంది. న్యాయస్థానం మధ్యవర్తి రాయబారం పూజాపురస్కారాలూ... ఇవన్నీ ఆకాశానికి గురిపెట్టి కొట్టిన బాణాల్లా నిష్ర్పయోజనాలే కావచ్చు ఈ వారంలో మాత్రం. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకోకుండా ఓ శుభకార్యం కలిసి రావచ్చు. ఆ కారణంగా ఇంటినిండుగా బంధువులూ మిత్రులూ పోగుపడొచ్చు. మీ వ్యవహారశైలీ ధర్మబద్ధ విధంగా మాట్లాడే మీ తీరూ కారణంగా మీ నిజాయితీతనం గుర్తింపబడి సక్రమంగా ముగుస్తాయి పనులన్నీ. కొత్త వ్యాపారపు ఆలోచన వద్దు. ఉద్యోగిగా ఉ ండడానికే ప్రాధాన్యమీయండి. విజయం నా సొంతమనుకుంటూ అహకరించకండి. క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20) ఖర్చులో ఖర్చు అనుకుంటూ పుణ్యక్షేత్రాలకి ప్రయాణం కడతారు. ఉన్నంతలో ధ ర్మకార్యాలనుకుంటూ దానాలనీ ధర్మాలనీ చేస్తారు. పనిలో పని అన్నట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇళ్ల తలుపు తడతారు. మాటలో మాట కలుపుదామనుకుంటూ నూతన వ్యాపార ఆలోచనని తెలియజేస్తారు పదిమంది మధ్యలో. దాంతో మీ నూతన వ్యాపారపు గుట్టు బయట పడే అవకాశం వస్తుంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కష్టపడీ పడీ ఉద్యోగం కోసం ఎదురు చూసిన మీకు తొందర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నిచ్చెన ఎక్కేటప్పుడు మొదటి మెట్టు మీదనే కాలు పెట్టి ఎక్కాలన్నట్టు జీతం తక్కువ అనే ఆలోచన మాని చేరడం ఎంతైనా మంచిది మీకు. సంతాన లాభం ఉంది. చదువుతున్న సంతానానికి తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఉత్తమ విద్యావంతుల్ని చేయగలుగుతారు. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) ఎందుకో తెలియదుగానీ మనుష్యుల వల్ల కాకుండా పెంపుడు జంతువుల కారణంగానో పక్షుల కారణంగానో కొంత ఇబ్బంది పడే సూచనలు కన్పిస్తున్నాయి- తగుజాగ్రత్తలతో ఉండడం మంచిది కదా! మీ కుటంబంలోనికి చుట్టపు చూపుగా వచ్చిన బంధువు కారణంగా మనఃస్పర్ధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన మేరకే ఉండండి. మరీ ఎక్కువా తక్కువా వద్దు. డా" మైలవరపు శ్రీనివాసరావు -
గుడ్ స్లీప్.. స్వీట్ డ్రీమ్స్
నిద్ర కరువై నలిగిపోతున్న నగరవాసి మానసిక ఒత్తిళ్లతో సతమతం ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం కెరీర్లోనూ వెనకడుగు నేడు వరల్డ్ స్లీప్ డే పొద్దుట్నుంచీ కంప్యూటర్‌కు అతుక్కుపోయిన కళ్లు రాత్రయినా మూతపడనంటున్నాయ్.. రేపటి మీటింగ్లూ, ప్లాన్లతో వేడెక్కిపోయిన మెదడు ఆలోచనల చట్రం నుంచి బయటకు రానంటోంది.. ఏసీలూ, కుషన్ సీట్ల పుణ్యాన అలసట రుచి ఎరుగని శరీరం విశ్రాంతికి సిద్ధమవ్వడం లేదు.. వెరసి... నగరవాసికి కునుకు ప్రియమవుతోంది. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన 8 గంటల నిద్ర అనేది అందని ద్రాక్షే అవుతోంది. అన్ని సౌకర్యాలు ఉండి కూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు, ఉన్నతోద్యోగులు నగరంలో చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిద్ర కోసం మందే మందు అనుకునే మందుబాబులు, నిద్రమాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడేవారు కోకొల్లలు. అందుకే బ్యాంక్ బాలెన్సులున్న కుబేరుల కన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని అంటుంటారు. -విశాఖ-కల్చరల్ ‘నిద్ర సుఖమెరుగదు’ అన్నారు పెద్దలు. ‘అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం’ అంటున్నారు ఆధునికులు. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్న నగరవాసులు... ‘నిదురమ్మా... నువ్వెక్కడమ్మా..!’ అంటూ అన్వేషిస్తున్నారు. నిద్రాభంగానికి గురవుతున్న వారిలో వారు వీరని తేడా లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి శాస్త్రవేత్తల దాకా, డిజైనర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. దీనికి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు... ప్రతి రంగంలోనూ పోటీ తీవ్రమవుతుండడం, విజయాలు సాధించాలనే తపన, తరచుగా లక్ష్యాలను పెంచుకుంటూ పోవడం... ఇలాంటి కారణాల వల్ల మెదడు సామర్థ్యానికి మించి పనిచేయాల్సి రావడం... వ్యక్తిని మానసికంగా తీవ్రమైన అశాంతికి గురిచేస్తున్నాయి. పొద్దస్తమానం అలజడికి అలవాటుపడిన మనసు మంచం ఎక్కగానే ఒక్కసారిగా మత్తులోకి జారిపోవడం కష్టం. మరోవైపు సమయానికి నిద్ర రాకపోతే రేపు లేవడం ఆలస్యమవుతుందని, పనులు సరిగా చేయలేమేమోననే ఆందోళన మరింతగా కునుకును దూరం చేస్తోంది. అలాగే శరీరానికి అవసరమైన కనీస శ్రమ లేకపోవడం, చెమట పట్టే పనులు చేయకపోవడం వల్ల రక్తప్రసరణ సమస్యలు ఏర్పడడం, విశ్రాంతి పొందాలనేంత పరిస్థితిని శరీరానికి కల్పించకపోవడం, టీవీలు, కంప్యూటర్లకు గంటల తరబడి కళ్లను అప్పగించడం... ఇవన్నీ మంచి నిద్రను దూరం చేసే కారణాలే. రోడ్డు ప్రమాదాల్లో కీలక పాత్ర 380 రోడ్డు ప్రమాదాలను కేస్‌గా తీసుకుని ఇటీవల ఎయిమ్స్ ఓ స్టడీని నిర్వహించింది. వీటికి కారణమైన కమర్షియల్ డ్రైవర్స్‌కు నిద్ర వేళలు సరిగా లేవని గుర్తించారు. వీరిలో 60 శాతం మంది అంతకు ముందురోజు రాత్రి సరిగా నిద్రపోలేదని తేలింది. ఆరోగ్య నిద్రకు ఇవిగో మార్గాలు సాధారణంగా ప్రతి మనిషికి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఇది నిరంతరాయంగా ఈ నిద్ర నిరంతరాయంగా ఉండాలి. పగలు కాస్సేపు రాత్రి కాస్సేపు పడుకుని ఆరుగంటలు పడుకున్నాం కదా అని భావించకూడదు. కొందరు అంతరాయంగా నిద్రపోతుంటారు. తరచూ లేస్తుంటారు. కొందరు ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేస్తుంటారు. కొందరు వేకువజామున మరీ తొందరగా లేస్తుంటారు. ఏమైనప్పటికీ నిద్రను నిర్దిష్టసమయంలో బయోలాజికల్ క్లాక్లా అలవాటు చేసుకోవాలి. నిద్ర లేమి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. నిత్యజీవనంపై దీనిప్రభావం కనిపిస్తుంది. మానసిక శారీకర రుగ్మతలకు హేతవు అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు నిద్ర పట్టకుండా చేసే కాఫీ..టీలు పరిహరించాలి మసాలాతో కూడిన ఆహారం రాత్రి పూట భుజించ కూడదు. తేలికపాటి ఆహారం ఉత్తమం పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి నిద్ర సమయంలో మెదడుకు పెద్దగా పనిచెప్పకూడదు. టీవీలు చూడటం లాంటివి మంచివి కాదు. సాయంత్రం కాస్సేపు నడిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది. పడక గది కూడా మన అభిరుచికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రమాత్రలకు దూరంగా ఉంటే మంచిది. -డాక్టర్ ఎన్.ఎన్.రాజు మానసిక వైద్య నిపుణుడు సర్వేలు ఏం చెబుతున్నాయి... తాజాగా ఏసీ నీల్సన్-ఫిలిప్స్ సంస్థలు విశాఖపట్నం, హైదరాబాద్‌తోసహా 25 నగరాలలో సర్వే నిర్వహించాయి. 35 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిర్వహించిన దీని ఫలితాల ప్రకారం... నగరాల్లో 93 శాతం మంది 8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. విచిత్రమేమిటంటే వీరిలో 2 శాతం మంది మాత్రమే తమ నిద్రలేమి గురించి వైద్యులతో ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల 15 శాతం మంది ఏకాగ్రత లోపానికి గురవుతుంటే... 62 శాతం మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా... అనే (నిద్ర కరవైతే వచ్చే అనారోగ్యం) సమస్య బారిన పడతున్నారు. నిద్ర సరిగా లేక తమ పని పాడవుతోందని వీరిలో 58 శాతం మంది అంటున్నారు. ఇక 11 శాతం మంది పనిచేసే సమయంలో నిద్ర కమ్మేస్తోందని అంటున్నారు. నిద్రపోయే సమయంలో 1 నుంచి 3 సార్లు మెలకువ వస్తోందని 72 శాతం మంది చెప్పడం ద్వారా తమది కలత నిద్ర అని చెప్పకనే చెప్పారు. నిద్ర కోసం టూర్‌కు వెళుతున్నా.. బీచ్ రోడ్డులోని మా కేఫ్ ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు అకౌంట్స్, రేపటి ప్రిపరేషన్ వగైరా పనులన్నీ పూర్తి చేసుకుని మద్దలపాలెంలోని మా ఇంటికి చేరటప్పటికి ఒంటిగంట అయిపోతుంది. ఆ తర్వాత మంచం ఎక్కి నిద్రకు ఉపక్రమించేటప్పటికి మరో అరగంట, నిద్రలోకి వెళ్లేటప్పటికి మరో అరగంట... మొత్తం మీద సగ టున రోజూ అర్ధరాత్రి దాటి 2 గంటలైతే గానీ నిద్రలోకి వెళ్లం. తిరిగి పొద్దున్నే 7 గంటలకు లేవకపోతే ఈ ట్రాఫిక్‌లో అనుకున్న సమయానికి రెస్టారెంట్‌కు చేరుకోలేం. మొత్తం మీద రోజూ 5 గంటలు నిద్రపోతే బాగా నిద్రపోయినట్టే. ఆదివారాలు కూడా సెలవుండదు కాబట్టి వారమంతా ఇదే పరిస్థితి. అందుకే ఒళ్లెరగని నిద్ర కోసం నెలకో, రెణ్నెల్లకో బ్రేక్ తీసుకుని ఏదో ఒక ప్రయాణం పెట్టుకుంటున్నా. - కె.సురేష్ కుమార్, కేఫ్ యజమాని నిద్ర‘యోగ’ం యోగాతో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రోజూ ఉదయం నిర్దేశిత సమయంలో సూర్యనమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా చేయాలి. దీనివల్ల నరాలన్నీ చేతనమవుతాయి. ఫలితంగా శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది నిద్రకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే భ్రమరీ ప్రాణాయామం కూడా చేయాలి. ఈ శ్వాసప్రక్రియ చాలా ప్రభావవంతమైంది. ఇది కూడా సుఖ నిద్రకు సహకరిస్తుంది. ఇక ధ్యానం వల్ల ఒనగూరే ప్రయోజనం చాలా ఎక్కువ. యోగాలో ప్రతి ప్రక్రియా శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇన్సోమ్నియాతో బాధపడేవారికి యోగా ప్రక్రియ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఆధునిక వ్యవస్థలో నిద్రలేమితో వచ్చేవే సగం రోగాలు. దీనికి యోగాసనాలు మంచి చిట్కా -పెనుమర్తి ప్రశాంతి, యోగా కౌన్సిలర్, విశాఖపట్నం మంచి నిద్రతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు అందానికి, ఆరోగ్యానికి, నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంది. తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం శరీరారోగ్యంపై పడుతుంది. నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగుతాయి. కొత్త కణాలు తయారవుతాయి. కొత్త కణాలు కొత్త అందాన్నిస్తాయి. మెమరీ పవర్: నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా, నేర్చుకోవాలనుకొన్నా మంచిగా నిద్రపోయి లేవడం వల్ల కొత్త ఐడియాలతో చురుకుగా పని చేయగలగుతాం. సృజనాత్మకత: మంచి నిద్ర పొందడం వల్ల మెదడు పునఃవ్యవస్థీకరణ, వాటిని పునరుద్ధరించుకునేందుకు అలాగే మరింత సృజనాత్మకత కారణం కావచ్చు. కళాకారులకు మాత్రమే కాదు పనిచేసే ప్రతి ఒక్కరికీ సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త కొత్త ఐడియాలను పొంది వారిలో దాగున్న క్రియేటివటీ బయటకు తీస్తారు.నిద్ర లేనివారిలో కొన్ని హార్మోన్లు రక్తంలో కలసి, ఆకలిని పెంచుతాయి. సరైన నిద్రలేనప్పుడు ఆకలి పెరగడం వల్ల బరువు తగ్గే చాన్సే ఉండదు. నిద్ర చాలా అవసరం. డిప్రెషన్: సరైన నిద్ర లేకపోవడం వల్ల మన ఓవరాల్ హెల్త్‌కు అవరోధం కలుగుతుంది. నిద్ర లేమితో వెనుకబడి నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మంచి నిద్రను పొందడం వల్ల వ్యక్తి మూడ్ మారుతుంది. ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగాలను తగ్గించుకుంటారు. మధుమేహం: నిద్రలేమి టైప్2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయి తగ్గి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. హెయిర్ ఫాల్: నిద్రలేమితో వివిధ ఆలోచనలు మదిలో మెదిలి మెద డు మీద ఒత్తిడి కలిగి హార్మోన్ల లోపంతో జుత్తు రాలిపోతుంది. హృద్రోగం : సరైన నిద్రలేకపోవడం వల్ల హృదయ వ్యవస్థ మందగిస్తుంది. రక్తనాళాలు, ధమనుల రక్తం సరిగా ప్రసవరణ జరగక గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతాయి. కృత్రిమ సాధనాలు వద్దు: నిద్రకు కృత్రిమమైన సాధనాలు ఉపయోగిస్తే మరికొన్ని కొత్త సమస్యలు తోడవుతాయి. -
మగవారి సరికొత్త సమస్య
జీవన విధానం మారడంతో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుత యువత జీవన శైలి మారిపోయింది. అంతేకాకుండా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ వారి దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలతోపాటు మగవారిలో కూడా సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం సర్వసాధారణమైపోయింది. దాంతో సరైన వయసులో పెళ్లి కాక, పెళ్లైనవాళ్లలో కూడా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తులున్నాయి. సంతానలేమితో బాధపడేవారిలో మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి. ఇది కేవలం అపోహ మాత్రమే. సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండే అవకాశం ఉంది.అసలు పురుషుల్లో సంతానలేమి ఎందుకు వస్తుంది? ఈ సమస్యను నిరోధించే మార్గాలేంటి? అనేది పరిశీలిస్తే ... కాలంతో పాటు పరిగెడుతున్న జీవితాలు, నిత్యం పలుసమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం కారణంగా సంతాన లేమి సమస్య తెలెత్తుతున్నట్లు నిర్ధార్ధించారు. మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం కష్టమే. మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. భార్యాభర్తలు ఏ గర్భనిరోధక సాధనం వాడకుండా ఒక సంవత్సర వైవాహిక జీవితం కొనసాగించిన తరువాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేదా సంతానలేమి అంటారు. ఈ సమస్య ఇప్పుడు మగవారిలో అధికంగా పెరిగిపోతోంది. ఆధునిక జీవన విధానం మగవారిలో ఈ సమస్యను పెంచుతోంది. సంతానం కలగచేసే సామర్థ్యం పురుషుల్లో క్షీణిస్తోంది. వారిలో వీర్య సామర్థ్యం తగ్గిపోతోంది. దానినే మేల్ ఫెర్టిలిటిగా పేర్కొంటున్నారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు. ప్రతి మగవారిలో సాధారణంగా 3-6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. 80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి. మామూలు వీర్యంలో దాదాపు 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలుంటాయి. పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు. సాధారణంగా సంతాన సాఫల్య సమస్యలను పరిశీలిస్తే మగవారిలో 40 శాతంగా ఉంటుంది. ఇద్దరిలో కలిపి 10 శాతం సమస్యలు ఉంటే, తెలియని కారణాలు 10 శాతం ఉంటాయి. మగవారిలో ఇన్ఫెర్టిలిటీ సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయి. హార్మోన్ల లోపం, మానసిక ఒత్తిడి, వెరికోసిల్ ఒక రకం కారణాలు ఐతే, ధూమపానం, మద్యపానం మరోరకం కారణాలుగా వైద్యులు నిర్ధారించారు. బీజంలో వివిధ ఇబ్బందులు, అంగస్థంభన సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల ఇన్ఫెర్టిలిటీ తలెత్తుతుంది. ఇన్ఫెర్టిలిటీ సమస్యను తెలుసుకోవడానికి పలు పరీక్షలున్నాయి. ఆ పరీక్షల ద్వారా కారణం తెలుసుకొని వైద్యుల సలహాపై తగిన మందులు వాడితే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. -
సోరియాసిస్ (psoriasis)
సోరియాసిస్ మచ్చలు పింక్ లేక ఎరుపు వర్ణంలో పొలుసులతో కూడి ఉంటాయి. చర్మం దళసరిగా ఉంటుంది. ఈ పొలుసులను బలవంతంగా తీస్తే వాటి కింద ఎర్రటి రక్తపు మచ్చలుగా కనిపిస్తాయి. ఈ సోరియాసిస్ మచ్చలు. కొంచెం కాని, ఎక్కువ సంఖ్యలోగాని ఉంటాయి. శరీరంలోని చాలా భాగాలలో అంటే చేతులు, కాళ్ళు, తల, వీపుమీద, మోకాళ్ళ ముందుభాగాన, ఉదరం, అరికాళ్ళు, అరిచేతులలో అధికంగా ఈ మచ్చలు వస్తాయి. పొలుసులు చాలా దట్టంగా, అధికంగా ఉండి కొవ్వొత్తి మైనం లాగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాపుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా చాతి, కాళ్ళమీద... సోరియాసిస్ ప్రధానంగా యుక్త, మధ్య వయస్సులో అధికంగా కనిపిస్తుంది. చాలా తక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులలో కనిపించవచ్చు. అధిక వత్తిడి వలన, వంశపారంపర్యంగా తల్లిదండ్రులకు ఉంటే వారి పిల్లలకు ఈ వ్యాధి రావటానికి అవకాశాలుంటాయి. కాలివేళ్ళు, చేతివేళ్ళ గోళ్లలో గుంటలు పడినట్లు ఉంటాయి. చికిత్సా విధానం ప్రధానంగా సోరియాసిస్ (కిటిభ కుష్టం) అనే వ్యాధిలో పంచకర్మ చికిత్సా విధానం ఎంతో ప్రముఖమైనది. ఈ పంచకర్మ విధానంలో వమన కర్మ ప్రధానమైనది. దీనివలన శరీరంలో ఉన్న చెడుభావాలు రసాయనాలు మొదలగు శరీరం నుండి బయటికి పంపబడతాయి. తక్రధార: ఈ చికిత్సా విధానంలో ప్రత్యేకంగా ఔషధాలతో తయారు చేయబడిన తక్రము లేదా మజ్జిగ ధారతో మచ్చలు గల శరీర భాగలను శుభ్రంగా తడపటం జరుగుతుంది. దీనివలన శరీరంపై భాగంలోని పొలుసులన్నీ ఊడిపోతాయి. నివారణ మానసిక వత్తిడి నుండి పూర్తిగా విముక్తి వలన పులుపు పదార్థాలు, మాంసాహార సేవన, సముద్ర ఉత్పత్తులు పూర్తిగా నిషేధించటం వలన వాయుకాలుష్యం, జల కాలుష్యం నుంచి దూరంగా ఉండటం పరిశ్రమలలో సరైన రక్షణ విధానాలు పాటించటం వలన నివారించవచ్చు. డాక్టర్ దీప్తి ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక ph: 8977 336688 / 90300 85456 www.starayurveda.com, Email : info@starayurveda.com -
మా అమ్మాయి మనసు మార్చేదెలా..?
మా అమ్మాయి వయసు 23. బీటెక్ పూర్తయి ఉద్యోగం చేస్తోంది. చాలా అందమైనది, తెలివైనది. క్రమశిక్షణగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి ఒక స్వామీజీ దగ్గరకెళ్లింది. స్వామీజీ తనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారట. అప్పటినుంచి ఆమె ఆ స్వామికి భక్తురాలిగా మారిపోయింది. తరచు స్వామి ఉండే ఆశ్రమానికి వెళ్లడం మొదలు పెట్టింది. పోనీలే అని మేము చూస్తూ ఊరుకున్నాము. అయితే కొద్దికాలంగా ఆమె ఉద్యోగం కూడా వదిలేసి పూర్తిగా ఆయన సేవకే అంకితమైపోయింది. పెళ్లి చేసుకోకుండా స్వామికి పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అంటోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఏం చేయమంటారు, సలహా ఇవ్వండి. - ఓ నిస్సహాయ తల్లిదండ్రులు, విశాఖపట్నం గాభరాపడకండి, ఇలాంటి సమస్య ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతోంది. అయితే అందరూ మీలాగా ధైర్యంగా బయటపడట్లేదంతే! సాధారణంగా ఇలా సన్యాస మార్గాన్ని ఎంచుకుంటున్న యువతీ యువకులలో చాలావరకు చిన్నప్పటినుంచి వివిధ కారణాల వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నవారే అయి ఉంటారు. మూడ్స్ తరచు మారిపోతుండటం, బాగా డల్‌గా లేదా బాగా యాక్టివ్‌గా ఉండటం కూడా వీరి లక్షణాలలో ఒకటి. ఇటువంటప్పుడు తల్లిదండ్రులు లేదా స్నేహితుల ఆసరా, సహకారం లభించకపోవడం వల్ల లేదా వారిముందు తమ సమస్యలను చెప్పుకోలేకపోవడం వల్ల మృదువుగా, మధురంగా మాట్లాడే స్వామీజీలవంటి వారి మాటల ప్రభావానికి ఇట్టే లోనయ్యే అవకాశం ఉంది. ఇదే అదనుగా అటువంటి స్వామీజీలు తమ మాటలతో, సాంత్వన వచనాలతో వారిని మరింతగా ఆకట్టుకుని, తమ చుట్టూ తిరిగేలా, తాము ఏది చెబితే దానిని గుడ్డిగా అనుసరించేలా చేసుకుంటారు. తమ శిష్యులుగా తయారు చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఇటువంటి వాటిని తొందరగా గమనించకపోవడం వల్ల, ఒకవేళ గమనించినా చూసీ చూడనట్టు వదిలేయడం వల్ల వారు స్వాముల ప్రలోభానికి, ప్రభావానికి మరింత ఎక్కువగా లోనై, వారి ఆకర్షణ నుంచి బయటకు రాలేని ఒకలాంటి తాదాత్మ్యస్థితిలోకి వెళ్లిపోతారు. మీరు మీ అమ్మాయి విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, వ్యవహారం పూర్తిగా తారుమారయే ప్రమాదం ఉంది. ముందు మీరు ఆశ్రమ సిబ్బందికి విషయాన్నంతటినీ వివరించి, వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడండి. తొలుత కొంతకాలంపాటు స్వామివారు ఇప్పుడు ఎవరినీ కలవాలని అనుకోవడం లేదని చెప్పిస్తూ, ఆశ్రమానికి వెళ్లడాన్ని తగ్గించేలా చేయండి. వారంలో కనీసం ఒకటి రెండు రోజులు తను ఎక్కడికీ వెళ్లకుండా మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉండేలా చేయండి లేదా మీరే ఆమెను అంటిపెట్టుకుని ఉండండి. ఎలాగో ఒకలాగా నచ్చజెప్పి, తనను వెంటబెట్టుకుని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకు వెళ్లండి. అంతకుమునుపే మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి విషయమంతా వివరిస్తే, వైద్యులు ఆమెతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. సైకియాట్రిస్ట్ ఆమెతో మాట్లాడిన తర్వాత అసలు ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుకగల కారణాలను విశ్లేషించి, అందుకు తగిన కౌన్సెలింగ్ లేదా అవసరమైతే మందులను ఇచ్చి, ఆమె నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసేందుకు ప్రయత్నించవచ్చు. మీ ప్రయత్నం మీరు చేయండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్