రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి.
గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగించింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలాగే, టీడీపీ కూటమికి 4-5 స్థానాల వస్తాయని వెల్లడించింది.
సర్వే ప్రకారం ఫలితాలు ఇలా...
👉: YSRCP: 19-20.
👉: TDP: 3-4.
👉: JSP: 0.
👉: BJP: 1-1.
Others: 0.
TIMES NOW- @ETG_Research Survey
Andhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections:
YSRCP: 19-20
TDP: 3-4
JSP: 0
BJP: 1-1
Others: 0 @PadmajaJoshi also takes us through vote share projections. pic.twitter.com/dzSNkzsEXB— TIMES NOW (@TimesNow) April 17, 2024
READ THIS ARTICLE IN ENGLISH : YS Jagan Again as CM: Top Surveys
ఇది కూడా చదవండి: ఏపీ ఎన్నికల ఫలితాల గురించి అన్ని సర్వేలు ఏం చేబుతున్నాయంటే..
Comments
Please login to add a commentAdd a comment