
న్యూఢిల్లీ: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ద్వైవార్షిక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021 ప్రకారం, భారతదేశం తన అటవీ విస్తీర్ణంలో 1,540 చ.కి.మీ పెరుగుదలను నమోదు చేసింది. ఈ మేరకు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్‌లలో అడవులు, చెట్ల విస్తీర్ణం ఉంది. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతంగా నమోదైంది. గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ మేర అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగింది.
దేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఏపీలో గరిష్టంగా 647 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైంది. తర్వాతి స్థానాల్లో తెలంగాణ 632 చ.కి.మీ, ఒడిశాలో 537 చ.కి.మీ ఉన్నాయి. దేశంలో దాదాపు 17 రాష్ట్రాలు, యూటీల్లో 33 శాతానికిపైగా అటవీ, చెట్ల విస్తీర్ణం ఉంది. మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్‌లో 70 శాతానికి పైగా అడవులు, చెట్ల విస్తీర్ణం ఉన్నట్లు ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.
చదవండి: (బీజేపీకి షాక్ మీద షాక్.. యూపీలో 24 గంటల వ్యవధిలో..)
Comments
Please login to add a commentAdd a comment