భారత్‌కు చెందిన మల్టీ నేషనల్ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ (TVS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) టీవీఎస్ క్రియాన్ (TVS Creon)ను దుబాయ్‌లో లాంచ్ చేస్తోంది. 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టీవీఎస్ క్రియాన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లుగా చెబుతున్న ఈ ఈ-స్కూటర్‌కు సంబంధించిన టీజర్ తాజాగా విడులైంది.
తాజా టీజర్‌లో స్కూటర్‌పై 'Xonic' అనే పదం రాసి ఉన్న క్లోజప్ కనిపిస్తోంది. ఈ టీజర్‌లో స్పీడోమీటర్ క్లైంబింగ్‌ను కూడా చూపించారు. గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగం ఉంటుందని, పూర్తి ఛార్జ్‌తో 100 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
స్కూటర్ స్పెసిఫికేషన్లు, ధర, డిజైన్, ఫీచర్లు (అంచనా)
కంపెనీ ఇప్పటివరకు స్పెసిఫికేషన్లు, రేంజ్, ఇతర సాంకేతిక వివరాల గురించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కొత్త టీవీఎస్ మోడల్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తుందని, ఐక్యూబ్ (iQube) కంటే ఎక్కువ పనితీరు ఉంటుందని భావిస్తున్నారు. హెడ్‌లైట్ కన్సోల్‌గా పనిచేసే నాలుగు ఎల్‌ఈడీ ల్యాంప్‌లను కలిగి ఉన్న ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటు స్కూటర్ పూర్తి టీఎఫ్‌టీ స్క్రీన్‌తో వస్తుంది.
ఈ-స్కూటర్‌లో బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్‌వాచ్-కనెక్ట్ కంట్రోల్‌లను కలిగి ఉంటుందని కూడా టీజర్ సూచించింది. వెనుక భాగంలో ఉన్న సొగసైన ఎల్‌ఈడీ ఇండికేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్‌తో పోలిస్తే కొత్త స్కూటర్ ప్రీమియం ధరలో ఉండవచ్చు. టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)తో పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment