TVS scooters
-
Electric Scooter: బైక్ లాంటి స్కూటర్ భలే ఉందే.. లాంచ్ చేస్తున్న టీవీఎస్
భారత్‌కు చెందిన మల్టీ నేషనల్ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ (TVS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) టీవీఎస్ క్రియాన్ (TVS Creon)ను దుబాయ్‌లో లాంచ్ చేస్తోంది. 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టీవీఎస్ క్రియాన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లుగా చెబుతున్న ఈ ఈ-స్కూటర్‌కు సంబంధించిన టీజర్ తాజాగా విడులైంది. తాజా టీజర్లో స్కూటర్‌పై 'Xonic' అనే పదం రాసి ఉన్న క్లోజప్ కనిపిస్తోంది. ఈ టీజర్లో స్పీడోమీటర్ క్లైంబింగ్‌ను కూడా చూపించారు. గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగం ఉంటుందని, పూర్తి ఛార్జ్‌తో 100 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్కూటర్ స్పెసిఫికేషన్లు, ధర, డిజైన్, ఫీచర్లు (అంచనా) కంపెనీ ఇప్పటివరకు స్పెసిఫికేషన్లు, రేంజ్, ఇతర సాంకేతిక వివరాల గురించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కొత్త టీవీఎస్ మోడల్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తుందని, ఐక్యూబ్ (iQube) కంటే ఎక్కువ పనితీరు ఉంటుందని భావిస్తున్నారు. హెడ్‌లైట్ కన్సోల్‌గా పనిచేసే నాలుగు ఎల్ఈడీ ల్యాంప్‌లను కలిగి ఉన్న ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటు స్కూటర్ పూర్తి టీఎఫ్టీ స్క్రీన్‌తో వస్తుంది. ఈ-స్కూటర్లో బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్‌వాచ్-కనెక్ట్ కంట్రోల్‌లను కలిగి ఉంటుందని కూడా టీజర్ సూచించింది. వెనుక భాగంలో ఉన్న సొగసైన ఎల్ఈడీ ఇండికేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్‌తో పోలిస్తే కొత్త స్కూటర్ ప్రీమియం ధరలో ఉండవచ్చు. టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)తో పోటీపడనుంది. -
టీవీఎస్.. స్టార్‌సిటీ ప్లస్
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా స్టార్ సిటీ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇది స్టార్ సిటీకి అప్‌గ్రేడెడ్ వేరియంట్. దీని ధర రూ. 44,000 (ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర). 110 సీసీ ఇంజిన్ సామర్ధ్యం ఉండే స్టార్ సిటీ ప్లస్.. లీటరుకు 86 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు. ఈ ఏడాది ప్రవేశపెట్టదల్చుకున్న వాహనాల్లో ఇది మొదటిదని, మరో నాలుగు నెలల్లో అప్‌గ్రేడెడ్ ఇంజిన్‌తో విక్టర్‌ను వాహనాన్ని రీలాంచ్ చేస్తామని ఆయన వివరించారు. ఇకపై ప్రతి త్రైమాసికంలోనూ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు, వచ్చే నెల స్కూటీ జెస్ట్‌ను ఆవిష్కరించనున్నట్లు వేణు వివరించారు. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్లో స్టార్ సిటీ, స్పోర్ట్.. 125 సీసీ విభాగంలో ఫీనిక్స్, అటు పైన హై ఎండ్‌లో అపాచీ ఆర్టీఆర్ బైక్‌లను టీవీఎస్ విక్రయిస్తోంది. అలాగే జూపిటర్, వెగో, స్కూటీ స్ట్రీక్, స్కూటీ పెప్ప్లస్ పేరిట స్కూటరెట్లను.. టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్, ఎక్స్ఎల్ హెవీ డ్యూటీ పేరిట మోపెడ్లను, టీవీఎస్ కింగ్ పేరుతో ఆటో రిక్షాలను విక్రయిస్తోంది. ప్రస్తుతమున్న స్టార్ సిటీ మోడల్‌ను దశలవారీగా నిలిపివేస్తామని టీవీఎస్ మోటార్ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. బీఎండబ్ల్యూ మోటోర్యాడ్ బైక్... జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం బీఎం డబ్ల్యూ.. మోటార్‌సైకిల్ విభాగం మోటోర్యాడ్తో ఒప్పందంలో భాగంగా తొలి వాహనాన్ని రూపొందిస్తున్నామని వేణు వివరించారు. ఇది వచ్చే ఏడాది ద్వితీ యార్థం నాటికి సిద్ధం కాగలదని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించి ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం టీవీఎస్ రూ. 142 కోట్లు ఇన్వెస్ట్ చే స్తుండగా, మోటార్‌సైకిళ్ల అభివృద్ధి.. టెస్టింగ్ ఖర్చులను బీఎండబ్ల్యూ భరిస్తుంది.