గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను.. షియోమీ ఎట్టకేలకు భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించింది. లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారును సంస్థ సాయర్ ఎల్ఐ (Sawyer Li) నాయకత్వంలో రూపొందించింది. ఈయన గతంలో బీఎండబ్ల్యూ విజన్ కాన్సెప్ట్ వంటి కార్ల రూపకల్పనలో ఐదేళ్లు పనిచేశారు.
చూడటానికి బీవైడీ సీల్ మాదిరిగా ఉండే ఈ కారు.. ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇది మినిమలిస్టిక్ లేఅవుట్‌తో ఒక పెద్ద టచ్‌స్క్రీన్ సెంటర్ స్టేజ్, ఒక డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద హెడ్స్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ రూఫ్ వంటివి పొందుతుంది.
షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 73.6 కిలోవాట్, 94.3 కిలోవాట్, 101 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. చైనీస్ లైట్-డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ (CLTC) ప్రకారం.. ఇది 800కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 265 కిమీ.
భారతదేశంలో కంపెనీ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దేశీయ విఫణిలో లాంచ్ అయితే దీని ధర రూ. 24.79 లక్షల నుంచి రూ. 34.42 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment