
సెక్యూర్డ్ రుణాల బిజినెస్‌లోకి ప్రవేశించడం ద్వారా ఎన్‌బీఎఫ్‌సీ పూనావాలా ఫిన్‌కార్ప్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో వాణిజ్య వాహన(సీవీలు) రుణాలు అందించనుంది. కొత్త, వాడుకలో ఉన్న వాహనాలకు రుణాలు సమకూర్చనుంది. తొలి దశలో భాగంగా టైర్–2, టైర్–3 మార్కెట్లలో ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. 12 రాష్ట్రాలలోని 68 ప్రాంతాలలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో 20 రాష్ట్రాలలో 400 ప్రాంతాలకు రుణ సర్వీసులను విస్తరించనున్నట్లు వివరించింది.
చిన్న, తేలికపాటి, భారీ వాణిజ్య వాహన నిర్వాహకులకు అవసరాలకు అనుగుణమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ఈ ఆవిష్కరణలో భాగంగా రిస్క్-ఫస్ట్ విధానంతో అనుసంధానించబడిన సాంకేతిక పరిష్కారాన్ని కూడా పరిచయం చేసింది. ఇది కస్టమర్లకు డాక్యుమెంటేషన్ ప్రక్రియను తగ్గించడంతో పాటుగా వేగంగా సర్వీసులు పొందేందుకు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: దివ్యాంగులకు కంపెనీల రెడ్ కార్పెట్..
పూనావాలా ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అరవింద్ కపిల్ మాట్లాడుతూ.. వాణిజ్య రవాణా రంగం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారుతుందని చెప్పారు. కొత్త వాణిజ్య వాహన రుణాల్లో క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలు, సులువైన డాక్యుమెంటేషన్‌తో రవాణాదారుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment