శిలాజ ఇంధనాల వాడకాన్ని నియంత్రించి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయినా వాటివినియోగం ఆశించినంతగా పెరగడం లేదు. అసలే వాటి ధరలు అధికం, అయినా కొనేద్దామనుకున్నా.. ఒకేసారి ఎక్కువ దూరం వెళ్లలేం, పైగాగంటలకు గంటలు చార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ త్వరలోనే పరిస్థితి మారిపోతుందని.. అసలు చార్జింగ్ అవసరం లేకుండానే వేల కిలోమీటర్లు తిరగొచ్చని మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రకటించింది. ఇందుకోసంవినూత్నమైన ‘సోలార్ పెయింట్’ను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.
దానంతట అదేచార్జింగ్ అవుతూ...
సోలార్ ప్యానల్స్ తరహాలో సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మార్చే ఈ ‘ఫొటో వోల్టాయిక్ పెయింట్’ను నానో పార్టికల్స్‌తో రూపొందించినట్టు మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. వాహనంపై వెలుగు పడినంత సేపూ చార్జింగ్ అవుతూనే ఉంటుందని... ఇలా ఏడాదిలో సుమారు 12 వేల కిలోమీటర్ల దూరం తిరిగేందుకు సరిపడా చార్జింగ్ లభిస్తుందని తెలిపారు. వాహనంపై మొదట సోలార్ కోటింగ్ వేసి, దానిపైన ప్రత్యేకమైన రంగుల కోటింగ్ వేస్తారని... దీనివల్ల ఇప్పుడున్న వాహనాల్లానే కనిపిస్తాయని వివరించారు.
మన దేశంలో అయితే మరింత లాభం
ఎక్కువగా ఎండ పడే ప్రాంతాల్లోఈ సోలార్ పెయింట్‌తో రూపొందించిన కార్లు వేగంగా, ఎక్కువగాచార్జింగ్ అవుతాయని కంపెనీప్రతినిధులు తెలిపారు. అంటే భారత్ సహా దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా, అరేబియన్ దేశాల్లో ఈ ‘సోలార్ పెయింట్’కార్లతో మరింత ప్రయోజనంఉండనుంది.
ఈటెక్నాలజీని కార్లు మాత్రమేకాదు బస్సుల వంటి ఇతర వాహనాల్లోనూ వాడవచ్చు. అయితే ఈ టెక్నాలజీకి అయ్యే ఖర్చుతక్కువేనని మెర్సిడెస్–బెంజ్ ప్రతినిధులు పేర్కొన్నా... అది ఎంతనేదిగానీ, దీనిని ఎప్పటికి మార్కెట్లోకి తీసుకువస్తారన్నదీ వెల్లడించలేదు.
పెయింట్‌తో ఎలా చార్జింగ్ అవుతుంది?
వాహనాల బాడీపై ఈ సోలార్ పెయింట్ కోటింగ్ వేస్తారు. అందులోనే అతి సన్నని ఎలక్ట్రోడ్‌లు కూడా ఉంటాయి. అవన్నీ ఒకదానికొకటి కలసి కారులోని బ్యాటరీ వ్యవస్థకు అనుసంధానం అవుతాయి. సోలార్ పెయింట్ సూర్యరశి్మని గ్రహించి ఈ ఎలక్ట్రోడ్‌ల ద్వారా విద్యుత్‌గా మార్చి బ్యాటరీకి పంపుతుంది. దీనితో కారుపై వెలుతురు పడినంత సేపూ (అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు) బ్యాటరీ చార్జింగ్ అవుతూనే ఉంటుంది.
ఇక ప్రత్యేకంగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ దూరం ప్రయాణించి, బ్యాటరీ ఖాళీ అయిపోయి, వెంటనే మళ్లీ ప్రయాణం చేయాల్సి వస్తేనే చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నిత్యం తక్కువ దూరాలకు వెళ్లేవారు అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదని మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
సాక్షి సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment