తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు! | Pedal electric Hopper German car | Sakshi
Sakshi News home page

తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!

Published Sat, May 18 2024 2:48 PM | Last Updated on Sat, May 18 2024 3:06 PM

Pedal electric Hopper German car

మీరు పెట్రోల్‌ లేదా డీజిల్‌, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ కార్లు, వాహనాలు చూసింటారు. సైకిల్‌ లాగా తొక్కే, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్‌ కార్లను ఎప్పుడైనా చూశారా? పెడల్-ఎలక్ట్రిక్, సెమీ ఎన్‌క్లోజ్డ్, సైకిల్/కార్-హైబ్రిడ్ కార్లు జర్మనీ  వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మొదట 2020లో కాన్సెప్ట్‌గా ప్రకటించిన ఈ వాహనాలను హాంబర్గ్‌కు చెందిన స్టార్టప్ హాప్పర్ మొబిలిటీ తయారు చేసింది. ఇది ఓపెన్-సైడ్ బాడీతో కూడిన త్రీ-వీలర్. వాతావరణ రక్షణను అందిస్తుంది.  అదే సమయంలో రైడర్‌ను సౌకర్యవంతమైన కారు లాంటి డ్రైవింగ్ పొజిషన్‌లో ఉంచుతుంది. చూడటానికి కారులా ఉన్నా.. చట్టబద్ధంగా దీన్ని ఈ-బైక్‌గా పరిగణిస్తున్నారు.

దీనికి 250-వాట్ రియర్‌ హబ్ మోటార్‌ను అమర్చారు. పెడలింగ్ చేస్తూ గంటకు 25 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లవచ్చు. అలాగే ఇందులో 30-Ah/48V/1,440-Wh లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జ్‌కు సుమారుగా 65 కిమీ ఇస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కారుపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ అమర్చుకుని బ్యాటరీని చార్జ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో వెనుక సీటు ఉండేది, లేనిది రెండు వర్షన్లు ఉన్నాయి. రెండు వెర్షన్లు గరిష్టంగా 160 కిలోల బరువును తట్టుకోగలవు.

ఇలాంటి 30 వాహనాలు ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్నాయి. వాహనం మొదటి ఎడిషన్ వాణిజ్య వెర్షన్ ఉత్పత్తి ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కానుంది. దీని ప్రీ ఆర్డర్‌ ప్రస్తుతం జర్మన్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంది. 13,500 యూరోలు (సుమారు రూ.12 లక్షలు) చెల్లించి దీన్ని ఆర్డర్‌ చేయవచ్చు. కంపెనీ ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా లభ్యతను విస్తరించే పనిలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement