టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ త‍్వరలో భారీ నష్టాల్ని చవిచూడనున్నారంటూ భారత సంతతి ఆంత్రప్రెన్యూర్ వివేక్ వాధ్వా హెచ్చరించారు. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ భారత్‌లో కాదని చైనాతో సంత్సంబంధాలు నెరపడంపై ఎక్స్ వేదికగా వివేక్ వాధ్వా మస్క్‌ను ప్రశ్నించారు.
తన ఈవీ కార్యకలాపాల కోసం భారత్‌ను కాదని చైనాని ఎంచుకోవడం మస్క్ భారీ మొత్తంలో నష్టపోనున్నారని వివేక్ వాధ్వా అన్నారు. చైనాలో ప్రమాదం అంచున వ్యాపారాలపై మస్క్‌కు మెయిల్ చేసినట్లు వెల్లడించారు. చైనా మస్క్‌ను గుడ్డిగా దోచుకుంటుందని నేను అతనిని ముందే హెచ్చరించాను. కార్ల తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సెంటర్ ఫర్ రష్యా యూరప్ ఆసియా స్టడీస్ డైరెక్టర్ థెరిసా ఫాలన్ పోస్ట్‌ను వివేక్ వాధ్వా ఉటంకించారు. థెరిసా ఫాలన్ తన పోస్ట్‌లో అమెరికా, యూరోపియన్ ఆటోమేకర్స్ చైనాలో ఎందుకు విఫలమవుతున్నారు.
స్వల్ప కాలిక లాభాల కోసం టెక్, మేనేజ్‌మెంట్ టెక్నిక్ అంశాల్ని అక్కడ అమలు చేయడం ద్వారా చైనా ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతుందని నివేదించారు. వాటి ద్వారా కార్ల తయారీ సంస్థలు ఎలా నష్టపోతున్నారని వివరించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించిన వాధ్వా మస్క్ గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment