మారుతీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది (2025) జరగబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారాను ప్రదర్శించే ప్రణాళికల్లో ఉంది. ఇటీవలే దీన్ని ఇటలీలో ఆవిష్కరించింది. వాహన రంగంలో దశాబ్దాల అనుభవంతో అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు.
మరోవైపు, సమగ్రమైన ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ డీలర్íÙప్‌లు, సరీ్వస్ టచ్ పాయింట్లలో ఫాస్ట్ చార్జర్ల నెట్‌వర్క్, హోమ్ చార్జింగ్ సొల్యూషన్స్ మొదలైనవి వీటిలో ఉంటాయని వివరించారు. సరైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్ద అవరోధంగా ఉంటోందని బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈవీలను మ రింత అదుబాటులోకి తెచ్చేందు కు, విస్తృత స్థాయిలో కస్టమర్లకు ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment