కారుకు నాలుగు చక్రాలు ఉండటం మామూలే! వెరైటీగా రెండు చక్రాలతోనే కారును రూపొందించాడు అమెరికాలో స్థిరపడిన చైనీస్ ఆవిష్కర్త షేన్ చెన్. ఇదివరకు ఇతడు హోవర్ బోర్డును ఆవిష్కరించాడు. సమాంతరమైన రెండు పెద్దచక్రాలతో రూపొందించిన ఈ కారుకు తన పేరునే పెట్టాడు.
‘షేన్’ పేరుతో రూపొందించిన ఈ కారు పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ కారులో ఏకకాలంలో డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణించడానికి వీలు ఉంటుంది. రెండు చక్రాలతోనే ఈ కారును రూపొందించడం వల్ల ఇది నగరాల్లోని రద్దీ ట్రాఫిక్‌లో సులువుగా ప్రయాణించగలదు.
ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా మలుపులు తీసుకోగలదు. పట్టణ, నగర ప్రాంతాల్లో సుదూర ప్రయాణాలకు అనువుగా దీనిని రూపొందించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment