ప్రపంచవ్యాప్తంగా ఇకపై పూర్తిగా విద్యుత్ కార్లనే తయారు చేసి విక్రయించాలని జర్మనీ వాహన సంస్థ ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయించుకుంది. తాజాగా భారత్‌లో తన మొదటి విద్యుత్ కారు ‘ఐడీ.4’ను ఆవిష్కరించింది.
గ్లోబల్‌గా ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. క్రమంగా దాదాపు అన్ని కంపెనీలు ఈవీవైపు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో విద్యుత్ వాహన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాదిలోనే ఈ కారును విపణిలోకి విడుదల చేయనున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మైఖేల్ మేయర్ తెలిపారు.
ఐడీ.4ను రెండు వేరియంట్‌లతో తీసుకోస్తున్నారు. 62 కిలోవాట్‌అవర్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ఒక్కఛార్జ్‌లో 336 కిమీ వరకు వెళ్లగలదు. సింగిల్-మోటార్, రియర్-వీల్-డ్రైవ్‌తో అందుబాటులో ఉంటుంది. రెండోది 82 కిలోవాట్‌అవర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక్కఛార్జ్‌తో 443 కిమీలు వెళ్లగలదు. సింగిల్-మోటార్, డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్‌తో మార్కెట్‌లో రానుంది. ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రూ.50లక్షలు-రూ.60లక్షల మధ్య ధర ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ కారును మార్కెట్‌లోని తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు
ఈ ఏడాది భారత ప్రయాణికుల వాహన విపణి 5-7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని.. తాము 10-15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. క్రమంగా విద్యుత్‌కార్లను ఆవిష్కరణను పెంచుతూ సమీప భవిష్యత్తులో పూర్తిగా ఈవీలను తయారుచేస్తామని మేయర్ తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ ముందు వరుసలో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment