దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా లేకుండా చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హరిత ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
భారత దేశం ఏటా ఇంధ దిగుమతులపై రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్రోల్, డీజిల్ వాహనాలు నిషేధిస్తే ఈ డబ్బును రైతులు, గ్రామాలు, యువతకు ఉపాధి వాటికి ఉపయోగించవచ్చు అని వెల్లడించారు.
అంతేకాదు, హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5శాతం, ఫ్లెక్స్ ఇంజన్లపై 12 శాతం మేర తగ్గించే ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు పంపామన్న ఆయన ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయని పేర్కొన్నారు.
పలు ఆటోమొబైల్ సంస్థలు ఫ్లెక్స్ ఇంజన్లను ఉపయోగించి మోటార్‌సైకిళ్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, ఆ సాంకేతికతను ఉపయోగించి ఆటో రిక్షాలను కూడా తయారు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం తను హైడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నారని, ఫ్యూచర్‌లో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఇది అసాధ్యమని చెప్పుకునేవాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకునే రోజులు వస్తాయని నితిన్ గడ్కరీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment